క్రైమ్/లీగల్

వాద్రాకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 19: యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు మనీలాండరింగ్ కేసులో కాస్త ఊరట లభించింది. వాద్రా ముందస్తు బెయిల్‌ను ఈ నెల 25వ తేదీ వరకు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అయితే, రాబర్ట్ వాద్రాను కస్టడీలోకి తీసుకొని విచారించవలసిన అవసరం ఉందని కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చెప్పడంతో ఈ విషయంలో దర్యాప్తుకు సహకరించవలసిందిగా వాద్రాను కోర్టు ఆదేశించింది. ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్ కుమార్ ఈ ఆదేశాలు జారీ చేశారు. లండన్‌లోని 12, బ్య్రాన్‌స్టోన్ స్క్వేర్‌లోని 1.9 మిలియన్ పౌండ్ల విలువయిన ఆస్తి కొనుగోలులో వాద్రా మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ అభియోగాలు నమోదు చేసింది. సదరు ఆస్తి వాద్రాదేనని ఈడీ ఆరోపించింది. ఈ కేసులో ఈడీ అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌కోసం వాద్రా పిటిషన్ పెట్టుకున్నారు. వాద్రా పిటిషన్‌పై జారీ చేసిన ముందస్తు బెయిల్‌ను మంగళవారం వరకు పొడిగిస్తూ కోర్టు ఫిబ్రవరి 16న ఆదేశాలు జారీ చేసింది.