రాష్ట్రీయం

‘గేట్’లో తెలుగు విద్యార్థి ప్రతిభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జాతీయ సాంకేతిక వృత్తి విద్యాసంస్థల్లో ఎంటెక్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే ‘గేట్’ పరీక్షలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రొక్కం సందీప్‌రెడ్డి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో జాతీయ స్థాయిలో 13వ ర్యాంకు సాధించాడు. 99,932 మంది విద్యార్థులు ఈ సబ్జెక్టులో పోటీపడగా, సందీప్‌రెడ్డి13వ ర్యాంకు సాధించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వంద మార్కులకు 84 సాధించి, అఖిల భారత స్థాయిలో ఆ పేపర్‌లో 13వ ర్యాంకు సాధించాడు. హైదరాబాద్ హస్తినాపురంలోని పద్మావతినగర్ కాలనీకి చెందిన సందీప్‌రెడ్డి మొదటి ప్రయత్నంలోనే గేట్‌లో జాతీయ స్థాయి ప్రతిభను కనబరచడంపై అధ్యాపకులు, సహ విద్యార్ధులు అభినందిస్తున్నారు. మర్రిగూడెం మండలం తిరుగండ్లపల్లి పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న తన తల్లి స్వరాజ్యం ఇచ్చిన స్ఫూర్తితో రోజుకు 8 గంటలు ఎంతో ఇష్టంతో ప్రిపేర్ అయ్యానని, అనుకున్న ఫలితం సాధించానని సందీప్ పేర్కొన్నాడు. ఐఐఎస్‌సీ (బెంగలూరు)లో ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ సీటు కోసం తాను అప్లై చేశానని, తనకు అందులో సీటు తప్పకుండా వస్తుందని భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఉస్మానియా యూనివర్శిటీలో బీటెక్ చేసిన సందీప్ గచ్చిబౌలిలోని సేల్స్‌ఫోర్సు కంపెనీలో బిగ్‌డాటా ఇంజనీర్‌గా ఏడాదికి 15 లక్షల వేతనానికి పనిచేశారు. ఆ ఉద్యోగానికి రిజైన్ చేసి ఎంటెక్ చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. సూర్యాపేట జేఆర్‌ఆర్ గ్రామర్ స్కూల్‌లో 8వ తరగతి వరకూ, హస్తినాపురంలోని క్రిష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో 10వ తరగతి చదివిన సందీప్ దిల్‌షుక్‌నగర్ నారాయణ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివాడు. ఇంటర్‌లో 974 మార్కులతో ఉత్తీర్ణుడైన సందీప్ ఎంసెట్‌లో 950 ర్యాంకు సాధించి ఉస్మానియా యూనివర్శిటీలో సీఎస్‌ఐ బ్రాంచిలో డిగ్రీ పూర్తి చేశాడు.