రాష్ట్రీయం

వైఎస్సాఆర్‌సీపీలోకి ఎస్వీ మోహన్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఒకవైపు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కోసం నామినేషన్ ప్రక్రియ జోరందుకున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సాఆర్ సీపీలోకి భారీగా వలసలు పెరిగాయి. గురువారం కర్నూల్ ఎమ్మెల్యే ఎస్‌వీ మోహన్‌రెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పారు. తన రాజీనామా ప్రకటించిన కొద్ది గంటల్లోనే వైఎస్సాఆర్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. అనంతరం మాట్లాడుతూ తనను మోసం చేసిన చంద్రబాబుకు ఎన్నికల్లో బుద్ధి చెబుతామని ఆయన ప్రకటించారు. కర్నూల్ అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలను వైఎస్సాఆర్ సీపీకి దక్కేవిధంగా పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు తన రాజీనామా లేఖను పంపించానని తెలిపారు. టీడీపీ అవలంభిస్తున్న విధానాలు పార్టీ నేతలకే కాకుండా ఆంధ్ర ప్రజలకు నచ్చడంలేదని, కర్నూల్ జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ స్థానాలతో పాటు 12 అసెంబ్లీ స్థానాలను వైఎస్సాఆర్ సీపీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 2014 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సాఆర్ సీపీ అభ్యర్థిగా కర్నూల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పుటికీ పార్టీమారి తప్పు చేశానన్నారు. తాను వైఎస్సాఆర్ సీపీలోకి రావడం సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందన్నారు. వైఎస్ జగన్మోహనరెడ్డికి మోసం చేసే నైజం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్ర సీఎంగా వైఎస్ జగన్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఆంధ్ర ఓటర్లపై ఉందన్నారు. ఏప్రిల్ 11న జరిగే పోలింగ్‌లో ఓటు విలువ ఏమిటో చూపించాలని ఆయన పిలుపు ఇచ్చారు. టీడీపీ కోసం తాను చేసిన కృషిని చంద్రబాబు గుర్తించలేదని మోహన రెడ్డి ఆరోపించారు. పార్టీలోకి వచ్చిన టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్‌కు టికెట్ ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకించి వైఎస్సాఆర్ సీపీ కండువా కప్పుకున్నానని ఆయన ప్రకటించారు.

చిత్రం..ఎస్వీ మోహన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న వైఎస్సాఆర్‌సీపీ అధినేత జగన్