ఆంధ్రప్రదేశ్‌

వైఎస్ కుటుంబం కేరాఫ్ పులివెందుల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల, మార్చి 22: రాష్ట్రంలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో కడప జిల్లా పులివెందులకు ప్రత్యేక స్థానం ఉంది. దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని ఆనాదిగా ఆదరిస్తో వస్తోంది ఈ నియోజకవర్గం. పులివెందులలో వరుస విజయాలతో వైఎస్ కుటుంబం ప్రత్యేకత చాటుకుంటోంది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మొదలు ఆయన కుటుంబ సభ్యులైన సోదరుడు వైఎస్.వివేకానందరెడ్డి, సతీమణి వైఎస్.విజయమ్మ, కుమారుడు వైఎస్.జగన్మోహన్‌రెడ్డిని ఎన్నికల్లో గెలిపిస్తూ వచ్చారు పులివెందుల ఓటర్లు. పులివెందుల అంటే వైఎస్ కుటుంబం, వైఎస్ కుటుంబం అంటే పులివెందుల అన్న చందంగా ఇక్కడ ఓటర్లు తమ అభిమానాన్ని దివంగత నేత కుటుంబంపై దశాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక్కడి నుంచి రెండు సార్లు హ్యాట్రిక్ సాధించి తిరుగులేని నేతగా నిలిచారు వైఎస్ రాజశేఖరరెడ్డి. పులివెందుల నియోజకవర్గం 1950లో ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 15 పర్యాయాలు శాసనసభకు ఎన్నికలు జరగ్గా, 11 సార్లు వైఎస్ కుటుంబం, మూడుసార్లు పెంచికల బసిరెడ్డి, ఒకసారి బాలరెడ్డి గెలిచారు.
1955లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన పెంచికల బసిరెడ్డి సమీప సీపీఎం అభ్యర్థి పొన్నంతోట వెంకటరెడ్డిపై గెలుపొందారు.
1962లో స్వతంత్య్ర అభ్యర్థి చవ్వా బాలిరెడ్డి సమీప కాంగ్రెస్ అభ్యర్థి బసిరెడ్డిపై గెలుపొందాడు. 1967, 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పెంచికల బసిరెడ్డి సమీప ప్రత్యర్థి అయిన పొన్నంతోట వెంకటరెడ్డి, చవ్వా బాలిరెడ్డిపై గెలుపొందారు.
1978లో వైఎస్.రాజశేఖరరెడ్డి రాజకీయ అరంగేట్రంతో వైఎస్ కుటుంబం ప్రస్థానం మొదలైందని చెప్పాలి.
కాంగ్రెస్ పార్టీ తరపున 1978 ఎన్నికల్లో రాజశేఖరరెడ్డి సమీప కాంగ్రెస్(ఐ) అభ్యర్థి డాక్టర్ బండి సోమిరెడ్డిపై గెలుపొందారు.
1983లో రాజశేఖరరెడ్డి మరోసారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి కాంగ్రెస్(ఐ) అభ్యర్థి బాలిరెడ్డిపై గెలిచారు.
1985లో జరిగిన ఎన్నికల్లో వైఎస్ మూడో సారి పోటీచేసి టీడీపీ అభ్యర్థి డాక్టర్ సదాశివారెడ్డిపై గెలుపొందడం ద్వారా హ్యాట్రిక్ సాధించారు.
1989లో వైఎస్.వివేకానందరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి టీడీపీ అభ్యర్థి లింగారెడ్డి రామమునిరెడ్డిపై గెలుపొందారు.
1991 ఉప ఎన్నికల్లో ఎస్.పురుషోత్తమరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి టీడీపీకి చెందిన అన్నారెడ్డి భాలస్వామిరెడ్డిపై 90 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
1994లో వైఎస్ వివేకానందరెడ్డి సమీప టీడీపీ అభ్యర్థి సింగారెడ్డి రామమునిరెడ్డిపై గెలుపొందారు.
1999, 2004, 2009 ఎన్నికల్లో వైఎస్.రాజశేఖరరెడ్డి సమీప టీడీపీ అభ్యర్థి ఎస్‌వి.సతీష్‌కుమార్‌రెడ్డిపై వరుస విజయాలు సాధించి రెండోసారి హ్యాట్రిక్ సాధించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణంతో 2009లో వైఎస్ విజయమ్మ ఏకగ్రీవంగా పులివెందుల నుంచి గెలుపొందారు.
అనంతరం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు.
2011లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ టీడీపీ అభ్యర్థి మాచిరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డిపై 81,373 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
2014 ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీప టీడీపీ అభ్యర్థి ఎస్‌వి.సతీష్‌కుమార్‌రెడ్డిపై 73,243 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
2019 ఎన్నికల్లో వైకాపా తరఫున వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పోటీ చేస్తుండగా టీడీపీ తరఫున ఎస్‌వి.సతీష్‌కుమార్‌రెడ్డి బరిలో నిలిచారు.
పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల, సింహాద్రిపురం, లిం గా ల, తొండూరు, వేముల, వేంపల్లె, చక్రాయపేట మండలాలున్నా యి.
నియోజకవర్గంలో మొత్తం 2,12,323 మంది ఓటర్లు ఉండగా అందులో మహిళలు 1,07,790 మంది, పురుషులు 1,04,519 మంది ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో విజేతను నిర్ణయించేది మహిళామణులే.

పులివెందుల నుంచి గెలిచిన అభ్యర్థులు..

సం. విజేత పార్టీ ప్రత్యర్థి అభ్యర్థి

1955 పెంచికల బసిరెడ్డి కాంగ్రెస్ పొన్నంతోట వెంకటరెడ్డిపై
1962 చవ్వా బాలిరెడ్డి స్వతంత్ర బసిరెడ్డి
1967 పెంచికల బసిరెడ్డి కాంగ్రెస్ పొన్నంతోట వెంకటరెడ్డి
1972 పెంచికల బసిరెడ్డి కాంగ్రెస్ చవ్వా బాలిరెడ్డి
1978 వైఎస్.రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ డాక్టర్ బండి సోమిరెడ్డి
1983 వైఎస్.రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ బాలిరెడ్డి
1985 వైఎస్.రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ డాక్టర్ సదాశివారెడ్డి
1989 వైఎస్.వివేకానందరెడ్డి కాంగ్రెస్ లింగారెడ్డి రామమునిరెడ్డి
1991 వైఎస్.పురుషోత్తంరెడ్డి కాంగ్రెస్ అన్నారెడ్డి భాలస్వామిరెడ్డి
1994 వైఎస్.వివేకానందరెడ్డి కాంగ్రెస్ సింగారెడ్డి రామమునిరెడ్డి
1999 వైఎస్.రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ ఎస్‌వి.సతీష్‌కుమార్‌రెడ్డి
2004 వైఎస్.రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ ఎస్‌వి.సతీష్‌కుమార్‌రెడ్డి
2009 వైఎస్.రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ ఎస్‌వి.సతీష్‌కుమార్‌రెడ్డి
2011 వైఎస్.విజయమ్మ వైకాపా మాచిరెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి
2014 వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వైకాపా ఎస్‌వి.సతీష్‌కుమార్‌రెడ్డి