ఆంధ్రప్రదేశ్‌

ఇద్దరు ముఖ్యమంత్రులను అందించిన ఎమ్మిగనూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, మార్చి 22: కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులను రాష్ట్రానికి అందించిన ఘనత నియోజకవర్గ ప్రజలకు దక్కింది. వారిలో ఒకరు దామోదరం సంజీవయ్య కాగా మరొకరు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి. 1955లో జరిగిన మొట్టమొదటి సారి శాసనసభ ఎన్నికలు జరిగినప్పుడు ఎమ్మిగనూరు ద్వి శాసనసభ నియోజకవర్గంగా ఉంది. అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన సంజీవయ్య, సీపీఐ అభ్యర్థి రామచంద్రయ్యను ఓడించారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ప్రజా సోషలిస్టు పార్టీ నాయకుడు ఎన్‌ఎస్‌రెడ్డిని ఓడించారు. తదనంతరం దామోదరం సంజీవయ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన కోట్ల విజయభాస్కర్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి అబ్దుల్ రజాక్‌పై గెలుపొందారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి రాజకీయ ప్రస్తావన ఎమ్మిగనూరు నియోజకవర్గం నుండే ప్రారంభం కావడం మరో విశేషం. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి నాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి దృష్టిలో పడి మంత్రిగా ఆ తరువాత ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి ఎమ్మిగనూరు నియోజకవర్గం దోహదం చేసింది.