ఆంధ్రప్రదేశ్‌

ఘనంగా దేవాన్ష్ పుట్టినరోజు వేడుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 8: చంద్రబాబు మనుమడు, లోకేష్ కుమారుడు దేవాన్ష్ తొలి పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం రాత్రి విజయవాడ నగరంలో ఘనంగా జరిగాయి. ఆంగ్ల కాలమానం ప్రకారం దేవాన్ష్ మార్చి 21న జన్మించాడు. తెలుగు తిథి ప్రకారం ఉగాది రోజున జన్మించాడు. కాబట్టి ఉగాది రోజునే దేవాన్ష్ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించాలని భావించిన చంద్రబాబు నాయుడు స్థానిక ఎ కనె్వన్షన్ హాల్‌లో భారీ ఎత్తున విందు ఇచ్చారు. రాష్ట్రం లోని ఐఎఎస్, ఐపిఎస్‌లు ఇతర ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. సుమారు 800 మందికి ముఖ్యమంత్రి విందు ఇచ్చారు. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, లోకేష్, బాలకృష్ణ దంపతుల సమక్షంలో దేవాన్ష్‌తో కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి కూడా హాజరయ్యారు.

మనవడి పుట్టినరోజు వేడుల్లో పాల్గొన్న
చంద్రబాబు, లోకేష్ దంపతులు... మనవడు దేవాన్ష్ ముద్దాడుతున్న చంద్రబాబు

టిడిపిలోకి మరికొందరు
వైకాపా ఎమ్మెల్యేలు
11న జ్యోతుల నెహ్రూ * 15న మరో ఇద్దరు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 8: ఆపరేషన్ జగన్ పేరుతో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అమలు చేస్తున్న కార్యాచరణ సత్ఫలితాలనే ఇస్తోంది. శుక్రవారం నాడు ఇద్దరు శాసనసభ్యులు వరుపుల సుబ్బారావు, సునీల్ కుమార్‌లు తెలుగుదేశం పార్టీలో చేరగా, మరో నలుగురు శాసన సభ్యులు సైతం వైకాపా నుండి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం అయిందని చెబుతున్నారు. ఇప్పటికే టిడిపిలో చేరుతున్నట్టు ప్రకటించిన జ్యోతుల నెహ్రూ ఈ నెల 11న టిడిపిలో చేరుతారని టిడిపి నేతలు చెబుతున్నారు. కాగా కృష్ణా జిల్లాకు చెందిన మరో వైకాపా ఎమ్మెల్యే సైతం టిడిపి నేతలతో చర్చలు కొనసాగిస్తున్నట్టు సమాచారం. కడప, విజయనగరం జిల్లాల నుండి కూడా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. వైకాపాలో ఉన్న ఎమ్మెల్యేల మాట ఇటు స్థానిక అధికారులు వినక పోవడం, కార్యకర్తలకు ఎలాంటి పనలు చేయలేని దుస్థితిలో ఉండటంతో ఒక వైకాపా ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తాము పార్టీ మారక తప్పని స్థితి వచ్చిందని వారు చెబుతున్నారు.

ఉచితంగా 15 లక్షల పంపుసెట్లు
ఫైలుపై బాబు సంతకం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 8: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వ్యవసాయ పంపుసెట్ల స్థానంలో తక్కువ విద్యుత్‌తో పనిచేసే ఆధునిక పంపుసెట్లను రైతులకు అందించే ఫైలుపై ముఖ్యమంత్రి శుక్రవారం సంతకం చేశారు. తెలుగు సంవత్సరం ఆరంభం రోజున తాను ఈ తొలి సంతకం చేయడం ఎంతో ఆనందంగా ఉందని చంద్రబాబు అన్నారు. రాష్టవ్య్రాప్తంగా 15 లక్షల మంది రైతులకు ఈ పంపుసెట్లను మూడేళ్లలో అందిస్తామని తెలియచేశారు.

ప్రస్తుతం రైతుల వద్ద ఉన్న పంపుసెట్లను తీసుకుని, వాటి స్థానే కొత్త పంపుసెట్లను ఎటువంటి రుసుము తీసుకోకుండా అందచేస్తామని ఆయన చెప్పారు. దీనివలన 30 శాతం విద్యుత్ ఆదా అవుతుందని అన్నారు.