క్రైమ్/లీగల్

భారీగా వన్యప్రాణుల స్మగ్లింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 22: ప్రపంచ వ్యాప్తంగా ఆయుధాలు, డ్రగ్స్ వ్యాపారాల తర్వాత అతి పెద్ద అక్రమ వ్యాపార వ్యవస్థగా వన్యప్రాణి సంబంధ నేర సామ్రాజ్యం విస్తరించిందని వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో సదరన్ రీజియన్ (చెన్నై) డిప్యూటీ డైరెక్టర్ టి ఉమ చెప్పారు. ఏటా 20 బిలియన్ యూ ఎస్ డాలర్ల మేర వన్యప్రాణి వ్యాపారం సాగుతోందని గుర్తించినట్టు చెప్పారు. వన్యప్రాణి నేర నిరోధక విభాగం (వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో) ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులకు ఇంటిలిజెన్స్ అండ్ ప్రాసిక్యూషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ క్రైమ్ అనే అంశంపై బ్యూరో ఆధ్వర్యాన శుక్రవారం రాజమహేంద్రవరం ఫారెస్ట్ అకాడమిలో సెమినార్ ప్రారంభమైంది. అకాడమి డైరెక్టర్ జె ఎస్సెన్ మూర్తి, వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఆర్డీడీ ఉమ సెమినార్‌ను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అకాడమి డైరెక్టర్ మూర్తి మాట్లాడుతూ వన్యప్రాణి నేరాల నిరోధానికి బ్యూరో చేస్తున్న కృషిని వివరించారు. అటవీ, పోలీసు, కస్టమ్స్ తదితర శాఖలకు వన్యప్రాణి నేరాలపై నిఘా, దర్యాప్తు విధి విధానాలపై అవగాహన కల్పించి సుశిక్షితులుగా తీర్చి దిద్దడం కోసం దేశ వ్యాప్తంగా బ్యూరో వర్క్ షాపులు నిర్వహిస్తుందన్నారు. అటవీ సిబ్బందికి తొలి దశలో డీడీ ఉమ శిక్షణ ఇచ్చారు. ప్రతి వన్యప్రాణి నేరం వెనుక అంతర్జాతీయ క్రైమ్ రాకెట్ ఉందన్నారు. రక్షిత వనాలు, అరణ్యాలను ఆనుకుని వున్న మన సమీప ప్రాంతాల్లోనే అంతర్జాతీయ నేరాలకు అంకురార్పణ జరుగుతున్నదనే స్పృహ అందరికీ ఉండాలన్నారు. అకాడమి డిప్యూటీ డైరెక్టర్ వి శ్రీహరిగోపాల్, ఫ్యాకల్టీ సభ్యులు పీవీ రమణకుమార్, పి నాగేశ్వరరావు, వైల్డ్ లైఫ్ ఇనస్పెక్టర్ శాంతి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. వివిధ వన్యప్రాణుల శరీర భాగాలతో తయారైన స్మగుల్డ్ ఉత్పత్తులను ఈ సందర్భంగా డీడీ ఉమ ట్రైయినీలకు, అటవీ అకాడమి అధికారులకు చూపించి వాటిని గుర్తించే విధానాన్ని వివరించారు. అకాడమి డిప్యూటీ డైరెక్టర్ ఎంవీ ప్రసాదరావు స్వాగతం పలికారు.