విజయవాడ

ఎక్కువ శాతం తప్పుడు ఫిర్యాదులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 24: సీ-విజిల్ యాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్, తదితర సామాజిక మాధ్యమాల ద్వారా వస్తున్నవాటిల్లో ఎక్కువ శాతం తప్పుడు ఫిర్యాదులేనని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. సామాజిక మాధ్యమాల ద్వారా వస్తున్న ఫిర్యాదులపై విధుల్లో ఉన్న సిబ్బంది తనిఖీలు చేస్తున్నారని తెలిపారు. సీ-విజిల్ యాప్ ద్వారా 2100 ఫిర్యాదులు వచ్చాయని, వాటిలో దాదాపు 900 ఫిర్యాదులు వాస్తవంగా ఉన్నాయని, మిగిలిన వాటిలో సరైన సమాచారం లేదన్నారు. 60శాతం ఫిర్యాదులు దాదాపు జరగలేదని, 90శాతం తప్పుడు ఫిర్యాదులుగా గుర్తించామన్నారు. ఫిర్యాదులను ఎన్నికల సంఘం స్వాగతిస్తోందని, సరైన సమచారం ఇవ్వడం ద్వారా తమకు సహకరించాలని కోరారు. సరైన సమాచారం ఉంటే దాడులు సహా ఇతర చర్యలు తీసుకుంటామని తెలిపారు. సోమవారం రాష్ట్రానికి 75మంది ఎన్నికల పరిశీలకులు, 13మంది పోలీస్ పరిశీలకులు వస్తున్నారని తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3గంటలకు ఓటర్ల తుది జాబితా సిద్ధవౌతుందని తెలిపారు. రెండు మూడురోజుల్లో రాజకీయ పార్టీలకు ఓటర్ల జాబితా అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. శుక్రవారం ఒక్కరోజే 4లక్షల మేర దరఖాస్తులను సిబ్బంది పరిష్కరించడం విశేషమని తెలిపారు. మార్చి 25 నుంచి ఏప్రిల్ 5లోగా కొత్తగా నమోదైన ఓటర్లకు ఎపిక్ కార్డులు జారీ చేస్తామని ద్వివేది వివరించారు.

దుర్గమ్మకు కథక్ నృత్య నీరాజనం
ఇంద్రకీలాద్రి, మార్చి 24: ఆదిపరాశక్తి శ్రీకనకదుర్గమ్మకు కథక్ నృత్యంతో కళకారులు అంజలి ఘటించారు. భక్తి శ్రద్ధలతో కళకారులు ముద్ర అభినయ నాట్య విన్యాసాలతో అద్భుత ప్రదర్శన ఇచ్చారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి సన్నిధిలో ఆదివారం సాయంత్రం బెంగుళూరు చెందిన మిథావినయ్, శిరీషవారలా, మనీషా, ఆకాంక్ష, కాదంబరి, శివానీల, బృందం ప్రదర్శించిన కథక్ నృత్యాలు భక్తిరసంతో ఓలలాడించాయి. తొలుత ‘యాకుందేందు తుషార హారధవళా యాశుభ్ర వస్తన్వ్రితా అంటూ అమ్మవారి స్తుతి చేశారు. అనంతరం శ్రీ కృష్ణ రాధా గోపికల సాగిన టుమారి అభినయ నవరస భావ అంశాలు నయనానందకరంగా సాగాయి. లతా మంజుష ప్రదర్శించిన నృత్యం మంత్ర ముగ్ధుల్ని చేసింది. నాట్యాచార్య సప్పా శివకుమార్ బృందం ప్రదర్శించిన జయం...జయం .. లలితా కళావాహినీ మరకత మణిమయ అంశాలకు కూచిపూడి నాట్య విన్యాసాలు చేసి అమ్మవారికి నీరాజనాలు అర్పించారు. ఈసందర్భంగా అమ్మవారికి కళాసేవ చేసిన కళకారులకు దేవస్థానం ఈవో వీ కోటేశ్వరమ్మ అమ్మవారి జ్ఞాపికలు, శేష వస్త్రాలు, ప్రత్యేక ప్రసాదాలను అందించి సత్కరించారు. ఈకార్యక్రమాన్ని కే బలరామ్ పర్యవేక్షించారు.