ఆంధ్రప్రదేశ్‌

వారంలోగా హైకోర్టుకు పూర్తిస్థాయి వసతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 26: రాజధాని ప్రాంతం నేలపాడులో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో వారం రోజుల్లోగా పూర్తి స్థాయి వసతులు కల్పించాలని సీఆర్డీఏ అధికారులను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా (సీఎస్) ఆదేశించారు. మంగళవారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌ను సీఎస్ పునేఠా కలిశారు. ఈ సందర్భంగా హైకోర్టులో ప్రస్తుతం ఉన్న వసతులు, కల్పించాల్సిన సౌకర్యాలపై చీఫ్ జస్టిస్‌తో చర్చించారు. వారం రోజుల్లోగా పూర్తి స్థాయిలో వసతులు కల్పిస్తామన్నారు. నేలపాడులోని తాత్కాలిక హైకోర్టు భవనంలోనే ప్రస్తుతం లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఇంకా హైకోర్టుకు సంబంధించిన అనేక విషయాలపై చీఫ్ జస్టిస్, సీఎస్ సమీక్షించారు. కార్యక్రమంలో హైకోర్టు రిజిస్ట్రార్ వేణుగోపాల్, న్యాయశాఖ కార్యదర్శి వెంకటరమణ, సీఆర్డీఏ ప్రత్యేక కమిషనర్ రామ్మోహన్‌రావు, అదనపు కమిషనర్ శేఖర్‌బాబు, సీఈ జక్రయ్య, ఎస్‌ఈ ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.