సూర్య.. కొత్త స్కెచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ నటుడిగా ఇమేజ్ తెచ్చుకున్న కమల్‌హాసన్ చేసినన్ని భిన్నమైన పాత్రలను ప్రపంచవ్యాప్తంగా ఏ హీరో చేయలేదని చెప్పాలి. ఇక మన తెలుగు హీరోలైతే ఇలాంటి ప్రయోగాలకు ఎప్పుడూ దూరం. మన హీరోలకు గ్లామర్, హీరోయిజమ్ ఉండాల్సిందే! ఈ విషయం పక్కనపెడితే కమల్‌హాసన్ స్ఫూర్తితో అక్కడ చాలామంది కొత్త హీరోలు ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. అందులో విక్రమ్, సూర్య, విజయ్ సేతుపతి లాంటి హీరోలు ముందుంటారు. ఇక స్టార్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న సూర్య తాజాగా మరో భిన్నమైన సినిమా కోసం సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ఆయన తదుపరి చిత్రాన్ని జాతీయ దర్శకుడు బాలతో చేస్తాడని కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తుంది. ఈమధ్య సూర్య నటించిన సినిమాలన్నీ వరుస పరాజయాల పాలవడం, పైగా అన్ని రొటీన్ పాత్రలు కావడంతో సూర్యకు కూడా బోర్ కొట్టినట్టుంది. అందుకే కాస్త భిన్నంగా ఆయన బాలతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. గతంలో బాల దర్శకత్వంలో నంద, పితామగన్ సినిమాలు చేశాడు. పితామగన్ తెలుగులో శివపుత్రుడు పేరుతో విడుదలైంది. పితామగన్ సూపర్‌హిట్ అవ్వడమే కాకుండా అటు జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. అందుకే రెగ్యులర్ ఫార్మేట్‌కి బ్రేక్ ఇవ్వడానికి ఆయన ఈ ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. మరి బాల హీరో సూర్యకోసం ఎలాంటి కథ సిద్ధం చేస్తాడో.. సూర్య పాత్ర ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి సూర్య ఫాన్స్‌లో నెలకొంది.