ఎస్‌డి అంటే ఇదీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాను ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రణవి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీసాయి అమృత లక్ష్మి క్రియేషన్స్ సమర్పణలో గోదారి భానుచందర్, తిరుపతి పటేల్ సంయుక్తంగా పాలిక్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం -ఎస్‌డి. కేరాఫ్ వెంచపల్లి ట్యాగ్‌లైన్. బంగారి బాలరాజు ఫేం కరోణ్య కత్రిన్, శ్రీజిత్ లావన్ జంటగా నటిస్తున్నారు. చిత్రం షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పాలిక్ మాట్లాడుతూ 1960-80 మధ్య జరిగిన యధార్థ సంఘటన బేస్ చేసుకొని ఎస్‌డి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. స్వచ్ఛమైన ప్రేమ నిర్వచనంతోపాటు ఫ్రెండ్‌షిప్ గొప్పతనం చూపిస్తున్నాం. ఈ నెలలో షూటింగ్ ప్రారంభించి ఆగస్టునాటికి పూర్తి చేయాలన్నది ప్రణాళిక. కరోణ్య కత్రిన్ ఇందులో దేవకిగా కనిపించనుంది. అలాగే శివుడు పాత్రలో శ్రీజిత్ లావన్ నటిస్తున్నాడు. ఎస్ అంటే శివుడు, డి అంటే దేవకి. వీరిద్దరి పేరూ వచ్చేలా ఎస్‌డి టైటిల్ పెట్టామన్నారు.