ప్రయోగాలు చేయాలనుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్లో అండ్ స్టడీగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు అక్కినేని నాగ చైతన్య. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతోపాటు భిన్నమైన కానె్సప్ట్‌లవైపూ మొగ్గు చూపుతున్నాడు. సమంతతో పెళ్లైయిన తరువాత
తాజాగా ఇద్దరూ కలిసి చేసిన
సినిమా మజిలీ. నిన్నుకోరి వంటి
ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీతో
దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్న
శివ నిర్వాణ దర్శకత్వంలో
తెరకెక్కిన సినిమా శుక్రవారం
ప్రేక్షకులముందుకు రానుంది.
ఈ సందర్భంగా నాగచైతన్యతో ఇంటర్వ్యూ..

మజిలీ ఎలా మొదలైంది?
-శివనిర్వాణ చేసిన నిన్నుకోరి చూశాను. బాగా అనిపించింది. ముఖ్యంగా డైరెక్టర్ క్లైమాక్స్‌ను డీల్ చేసిన విధానం నచ్చింది. ఫోన్ చేసి అభినందించా. ఇలాంటి టైప్ స్టోరీ ఏమైనా వుంటే చెప్పమని అప్పుడే అన్నా. రెండు నెలల తరువాత మజిలీ స్టోరీతో వచ్చాడు. 20 నిమిషాలు కథ చెప్పాడు. వెంటనే ఒప్పుకున్నాను.
హీరోయిన్‌గా సమంత ఆప్షన్ మీదేనా?
-కాదు. అది దర్శకుడి ఛాన్స్. శ్రావణి పాత్రకు సమంత అయితే బాగుంటుందని శివ అన్నాడు. నాక్కూడా పెళ్లి తరువాత సామ్ నేను కలిసి నటించడానికి మంచి స్టోరీ దొరికిందనిపించింది. తానూ బాగా చేసింది.
సమంత డామినేట్ చేసినట్టుంది?
-చేసింది (నవ్వుతూ). నిజంగా తను ఈ సినిమాలో నటించడం నాకు బాగా హెల్పయ్యింది. ఇద్దరి పాత్రలూ ఇంటెన్సివ్‌గా ఉంటాయి. తన పాత్రకంటే నా పాత్ర గురించి కూడా చాలా టెన్షన్ పడింది. తనతో పోటీపడి నటించాల్సి వచ్చింది.
ఇంతకీ కథేమిటి?
-ఇది పక్కాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సెంటిమెంట్స్ నేపథ్యంలో సాగే కథ. ముఖ్యంగా వారి జీవితం ఎలా వుంటుంది? లవ్, లైఫ్ అన్నింటిలో ఫెయిలైన ఓ కుర్రాడి లైఫ్ స్టోరీ. అతని లైఫ్‌లోకి శ్రావణి అనే అమ్మాయి ఎంట్రీ అయ్యాక జరిగే పరిణామాలు ఏమిటన్న కథతో చాలా నాచురల్‌గా ఉంటుంది. ఇందులో ఎమోషన్స్ అందరికీ నచ్చుతాయి.
సెట్స్‌లోను, ఇంట్లో సమంత మీ మధ్య సినిమా గురించి చర్చలు జరిగేవా?
-సెట్స్‌లోవుంటే ఇద్దరం సినిమా గురించి చర్చించుకుంటాం. ఇంకా బెటర్‌గా వచ్చేలా ట్రై చేస్తాం. ఉదయం 9నుంచి సాయంత్రం 6 వరకే మేము యాక్టర్స్. తరువాత మాకూ పర్సనల్ లైఫ్ ఉంటుందిగా. ఆ టైంలో సినిమాల గురించి నో డిస్కషన్స్.
సమంతతో వర్క్ కంఫర్ట్‌గా భావించారా?
-తప్పకుండా. చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఇద్దరం కలిసి మూడు నాలుగు సినిమాలు చేశాం. తన బాడీ లాంగ్వేజ్ ఏమిటో నాకు తెలుసు. తాను ఎలా రియాక్టవుతుందో తెలుసు కాబట్టి తనతో నటించడం కంఫర్ట్‌గా ఫీల్ అవుతా. భవిష్యత్‌లో ఆమెతో మరిన్ని సినిమాలు చేయాలని ఉంది.
తమిళ సూపర్ డీలక్స్‌పై ఒపీనియన్?
-చూసా. అందులో సమంతతోపాటు అంతా బాగా చేశారు. నిజంగా మంచి సినిమా. నాకు ఇలాంటి భిన్నమైన సినిమాలు చేయాలని ఉంది. కానీ అలాంటి ఛాన్సులు రావడం లేదు. అందరూ రొమాంటిక్ కథలనే తెస్తున్నారు. తప్పకుండా నాకు ప్రయోగాత్మక పాత్రలు చేయాలని ఉంది.
నాగార్జున మార్పులేమైనా సూచించారా?
-ఇంకా ఆయన సినిమా చూడలేదు. ముందే చూపిద్దాం అనుకున్నాం కానీ రీ రికార్డింగ్ అప్పటికి పూర్తికాలేదు. లవ్‌స్టోరీస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ లేకుండా చూస్తే అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు.
దర్శకుడు శివ గురించి?
-శివ చాలా మంచి దర్శకుడు. ముఖ్యంగా సున్నితమైన భావాలను బాగా చూపించగలడు. అతని సినిమాల్లో ఓ సాఫ్ట్ కార్నర్ ఉంటుంది.
నిర్మాతల గురించి?
-హరీష్, సాహుతో కలిసి చేయడం చాలా హ్యాపీ అనిపించింది. స్క్రిప్ట్ స్టేజ్‌లో ఇలాంటి సినిమాను ఓకే చేసి జడ్జ్ చేయడం గొప్పవిషయం. నాకు, సామ్‌కు ప్రెస్టేజియస్ ప్రాజెక్టు ఇది. అయితే నాన్న కూడా అడిగారు, మన స్టూడియోలో చేయకుండా బయటివాళ్లతో ఎందుకని. నిజానికి ఈ బ్యానర్‌లో చేయడంవల్ల హోమ్ ప్రాజెక్టులో చేసినట్టనిపించింది. అంత ఫ్రీడమ్ ఇచ్చారు.
తదుపరి చిత్రాలు?
-వెంకిమామ మరో షెడ్యూల్ ఈనెల 8నుండి మొదలవుతుంది. దాంతోపాటు బంగార్రాజు సినిమా కూడా ఉంటుంది. అలాగే మరో రెండు కథలు కూడా వింటున్నా.

-శ్రీనివాస్ ఆర్ రావ్