తెలంగాణ

భూ ప్రక్షాళనలో రెవెన్యూ సిబ్బంది చేతివాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, ఏప్రిల్ 18: తప్పుల తడకగా ఉన్న రెవిన్యూ రికార్డులను సరి చేసి భూముల విషయంలో రైతులకు సమస్యలు లేకుండా చేయాలన్న మంచి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ ప్రక్షాళన కార్యక్రమానికి రెవిన్యూ సిబ్బంది అక్రమాలు అవరోధంగా మారాయి. లంచాలకు అలవాటు పడ్డ నేరెడుగొమ్ము మండల రెవిన్యూ సిబ్బంది ఎలాంటి ఆధారాలు లేకున్నా పహాణీలో అర్హులైన రైతుల భూముల్లో కొద్ది మొత్తాన్ని తొలగించి తమ అనునాయుల పేర్లపై భూమి ఉన్నట్లు నమోదు చేయడంతో అర్హులైన రైతులు తమకు న్యాయం చేయాలని నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకున్న నాధుడే లేకుండా పోయాడు. నేరెడుగొమ్ము తహశీల్దార్ కార్యాలయంలో భూ ప్రక్షాళనలో భాగంగా జరిగిన అక్రమాలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నేరెడుగొమ్ము మండలం జోడుబాయితండాకు చెందిన లావుడ్యా బాల్య, లావుడ్యా వాల్య అనే ఇద్దరు సోదరులు సర్వే నెంబర్ 367/ ఆ లో డాక్యుమెంట్ నెంబర్ 748 ద్వార తేదీ 2.2.1993 న దేవరకొండ సబ్‌రిజిస్టార్ కార్యాలయంలో ఒక్కొక్కరికి 2.39 ఎకరాల భూమి చొప్పున మొత్తం 5.37 ఎకరాల వ్యవసాయ భూమిని జాయింట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అనంతరం రెవిన్యూ అధికారులు లావుడ్యా బాల్య, లావుడ్యా వాల్యలకు 2.39 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు పాస్‌పుస్తకాలను జారీ చేశారు. బాల్యకు 2.39 ఎకరాల భూమి ఉన్నట్లు పాస్‌బుక్ నెంబర్ 436579, పట్టా నెంబర్ 450 ద్వార గతంలో పాస్‌బుక్‌ను జారీ చేశారు. అయితే జాయింట్ రిజిస్ట్రేషన్ కలిగిన భూమికి సంబంధించి రెవిన్యూ అధికారులు రిజిస్ట్రేషన్ దారులు ఇతరులకు భూమిని అమ్మకున్నా జోడుబాయితండా కు చెందినచ కేతావత్ బాలూ అనే వ్యక్తి వడ్త్య బాలు పేరు మీద ఉన్న 39 గుంటల భూమిని కొనుగోలు చేసినట్లు అదికారులను మచ్చిక చేసుకొని పహాణీలో నమోదు చేయించుకున్నాడు. అంతే గాక జాయింట్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి వాల్య అనే వ్యిక్తి తన భూమిని కేతావత్ లక్ష్మికి గతం లోనే అమ్మివేయగా తప్పుడు డాక్యుమెంట్‌లు సృష్టించి బాల్య మరో సోదరుడు లష్కర్ 2 ఎకరాల భూమిని అమ్మినట్లు తప్పుడు కాగితాలు సృష్టించి 2 ఎకరాల భూమిని కేతావత్ బాలు తన పేరు మీద పహాణీలో నమోదు చేయించుకున్నాడు. లష్కర్ అనే వ్యక్తికి అసలు రెవిన్యూ రికార్డుల్లో పేరు లేకున్నా కేతావత్ బాలు పేరు మీద ఎలా భూమిని విక్రయించాడో, తప్పుడు కాగితాలు సృష్టించిన బాలుకు అధికారులు మద్దతు ఇచ్చి బాలుకు యాజమాన్య హక్కు ఎలా కల్పించారో రెవిన్యూ అధికారులకే తెలియాలి. తనకు జరిగిన అన్యాయం పై లావుడ్యా బాల్య రెవిన్యూ అధికారులను ఎన్ని సార్లు కలిసి విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయమై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని లావుడ్యా బాల్య అధికారులను కోరుతున్నాడు.
నా భూమిని ఇతరులపై పట్టా చేశారు : బాల్య
నా పేరు, నా సోదరుడు లావుడ్యా వాల్య పేరు మీద నేరెడుగొమ్ము మండలం జోడుబాయితండాలో సర్వే నెంబర్ 361/ ఆ లో 5.37 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అయితే ఇదే తండాకు చెందిన కేతావత్ బాలు అనే వ్యక్తికి తాను భూమిని అమ్మకున్నా, మా పేరు మీద ఉన్న రిజిస్ట్రేషన్ కాగితాలను కాన్సిల్ చేయకుండానే 3 ఎకరాల భూమి ఉన్నట్లు తప్పుడు రికార్డులను నమోదు చేసి కొత్త పాస్‌పుస్తకాలను జారీ చేశారు. తనకు జరిగిన అన్యాయం పై తహశీల్దార్ కార్యాలయంలో అధికారులను నెలలుగా కలుస్తున్నా పట్టించుకోవడం లేదు.
విచారణ జరిపిస్తాం : తహశీల్దార్ రాజయ్య
తనకు తెలియకుండా తమ పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని వీ ఆర్వో అక్రమంగా కేతావత్ బాలు అనే వ్యక్తి పేరు మీద నమోదు చేసి కొత్త పాస్‌పుస్తకాలను జారీ చేశారని తనకు న్యాయం చేయాలని లావుడ్యా బాల్య అనే వ్యిక్తి తనను కలిసి లిఖిత పూర్వక ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని నేరెడుగొమ్ము తహశీల్దార్ రాజయ్య చెప్పారు.
అయితే తాను మండలానికి కొత్తగా వచ్చానని తాను పాస్‌పుస్తకాలు జారీ చేసిన సమయంలో లేనని విచారణ జరిపి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.