జాతీయ వార్తలు

నా శాపమే ఫలించింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, ఏప్రిల్ 19: మాలేగావ్ పేలుళ్ళ కేసు నిందితురాలు, భోపాల్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ దిగ్బ్రాంతికర వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. జైలులో తనను చిత్ర హింసలు పెట్టినందుకు తాను శపించిన కారణంగానే ముంబయి ఉగ్రవాది దాడిలో ఐపీఎస్ అధికారి హేమంత్ కర్కారే మరణించారని ఇక్కడ జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆమె వ్యాఖ్యానించిన వెలుగులోకి రావడంతో దుమారం చెలరేగింది. ‘హేమంత్ కర్కారేను మాలేగావ్ పేలుళ్ళ కేసు దర్యాప్తు బృందం సభ్యుడు ముంబయికి పిలిపించారు, అప్పుడు నేను ముంబయి జైలులో ఉన్నాను.
ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోతే ప్రజ్ఞా ఠాకూర్‌ను విడుదల చేయాలని ఆ సభ్యుడు కర్కారేకు చెప్పారు, కానీ కర్కారే ఎంత మాత్రం వినలేదు, ఎలాగైనా ఆధారాలు తెస్తాం, లేకపోతే ఇప్పటికిప్పుడే సృష్టిస్తాం, ఆమెను విడుదల చేసే ప్రసక్తి లేదు..’ అని కర్కారే అన్నట్లుగా ప్రజ్ఞా ఠాకూర్ తెలిపారు. ఆ సమయంలోనే ‘నువ్వు నాశనం అయిపోతావు’ అని తాను అన్నానని, నెల రోజులు తిరగకుండానే అది జరిగిందని ప్రజ్ఞ తెలిపారు. తన వ్యాఖ్యలకు సంబంధించి ఎన్నికల కమీషన్ నోటీస్ ఇవ్వడంతో ఆమె రాత్రి పొద్దపోయన తరువాత వెనక్కితగ్గారు. బీజేపీ కూడా మద్దతు ఇవ్వకపోవడం తో ప్రజ్ఞ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.

అవి వ్యక్తిగత వ్యాఖ్యలు: బీజేపీ
న్యూఢిల్లీ : ముంబయ్ ఉగ్ర దాడిలో మరణించిన ఐపీఎస్ అధికారి హేమంత్ కర్కారేపై సాద్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని బీజేపీ స్పష్టం చేసింది. ఏళ్ళ తరబడి శారీరకంగా, మానసికంగా చిత్రవధకు గురైన వేదనతోనే ఆమె ఈ రకమైన వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని బీజేపీ పేర్కొంది. ఉగ్రవాదులను ఎదుర్కొంటూ ప్రాణాలు అర్పించిన యోధుడిగానే హేమంత్ కర్కారేను తాము గౌరవిస్తున్నామని, ఆమెను వీర జవానుగానే పరిగణిస్తున్నామని బీజేపీ వివరించింది.