జాతీయ వార్తలు

రియల్ లీడర్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైన్‌పూర్ (యూపీ), ఏప్రిల్ 19: దశాబ్ధాల తర్వాత సమాజ్‌వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీ అగ్ర నేతలు ఒకే వేదికపై కనిపించారు. లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న ఈ రెండు పార్టీల అధినేతలు ములాయం సింగ్ యాదవ్, మాయావతి శుక్రవారం ఒకే వేదికపై కనిపించి, సంయుక్తంగా ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. దశాబ్దాల వైరుధ్యాలకు స్వస్తి పలుకుతూ ములాయం సింగ్ యాదవ్‌ను వెనుకబడిన వర్గాల నిజమైన నేతగా మాయావతి అభివర్ణించారు. 1995లో ఎస్‌పీ, బీఎస్‌పి మధ్య బంధం తెగిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రెండు పార్టీలు విడివిడిగానే పోటీ చేశాయి. తాజాగా శుక్రవారం ఇక్కడి క్రిస్టియన్ కాలేజీ మైదానంలో సంయుక్తంగా ఈ రెండు పార్టీలు ఎన్నికల సభ నిర్వహించాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ములాయం సింగ్ యాదవ్ ‘చాలా కాలం తర్వాత నేను, మాయావతి ఒకే వేదికపైకి వచ్చాం, ఆమెకు స్వాగతం పలకండి, కృతజ్ఞతలు తెలపండి..’ అని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాయావతి సమాజ్‌వాది పార్టీతో చేతులు కలపడాన్ని గట్టిగా సమర్థించుకున్నారు. ఇటు పార్టీ, ప్రజల సంక్షేమం కోసం కొన్ని సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని ఆమె వ్యాఖ్యానించారు. ములాయం సింగ్ యాదవ్ కోసం తాను ప్రచారానికి రావడం ప్రతి ఒక్కరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని, ప్రజల కోసం రాష్ట్రం కోసం ఇలాంటి నిర్ణయాలు తప్పవని ఉద్ఘాటించారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను ములాయం సింగ్ యాదవ్ ఒకే తాటిపైకి తేగలిగారని ఆమె అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీలా ఆయన నకిలీ నాయకుడు కాదని, వెనుకబడిన వర్గాల నిజమైన నాయకుడని మాయావతి అన్నారు. ప్రసంగం చివర్లో ఆనవాయితీగా ‘జై భీం’ అని నినాదం చేసిన మాయావతి వెంటనే సరిదిద్దుకుని ‘జై లోహియా’ అని ముగించారు.