Others

యంజిఆర్- సస్పెన్స్ (ఆనాటి హృదయాల..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యంజిఆర్ రాజకీయాల్లోకి రాకముందుమాట! చెన్నైలో ఎక్కడ చూసినా ఆయన పోస్టర్సే... ఎక్కడ విన్నా ఆయన మాటలే. పేదసాదలను ఆదుకోవడంలోనేకాదు ముఖ్యంగా విద్యార్థులకు క్లాసు పుస్తకాలు, కాలేజీ స్టూడెంట్స్‌కి ఫీజులూ... రిక్షావాళ్లకు ఎండకోసం పెద్దటోపీ, వర్షం వస్తే పెద్ద రెయిన్‌కోటూ.. ఇలా తన ధాతృత్వాన్ని ప్రదర్శిస్తూ వుండేవాడు. జర్నలిస్టు సోదరులక్కూడా ఖరీదైన చేతి గడియారాలివ్వడం నాకు తెలుసు. వారిలో నేనూ ఒకడ్ని గనుక-
అటువంటి యంజిఆర్... ఒక ప్రతిష్ఠాత్మకమైన భారీ చిత్రాన్ని మొదలుపెట్టాడు. ఆ చిత్రం పేరు ‘ఉళహం సుత్రియ వీరన్’ (లోకం చుట్టిన వీరుడు). ప్రపంచ దేశాల్లో షూటింగు జరుపుకోనుందని తెలిసి ఆ చిత్రం షూటింగు ప్రోగ్రెస్ కోసం ఆసక్తిగా ఎదురుచూశాం. కానీ, యంజిఆర్ ఆఫీసునుంచి ఏ సమాచారం అందేది కాదు. షూటింగు నెల రోజులనుకున్నది వాతావరణం సహకరించక మూడు మాసాలయ్యింది.
పోస్ట్‌ప్రొడక్షను మరో మూడు మాసాలయ్యింది.
సాధారణంగా.. ఏ చిత్రానికైనా షెడ్యూలుముందు షెడ్యూలు అయిన తరువాత ఒప్పందం ప్రకారం డబ్బులు ఇస్తుంటారు. ఈ చిత్రం విషయంలో ఏంజరిగిందంటే షెడ్యూలుముందు ఇచ్చిన అడ్వాన్స్ తరువాత మరి ఇవ్వలేదు. నటీనటులూ సాంకేతిక నిపుణులూ అందరూ గుసగుసలాడుకోవడం తప్ప చేయగలిగిందేం లేదు. పోనీ పెద్ద నటీనటులకు సాంకేతిక నిపుణులకూ డబ్బులిచ్చారంటే అదీలేదు. కెమెరామన్, ఎడిటరు, హీరోయిన్ మంజుల.. ఇత్యాది పెద్దవాళ్లకు ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు.
సినిమా ఫస్ట్‌కాపీ వచ్చింది.
ఇహ ఇస్తార్లే అనుకున్నారంతా.
ఇప్పట్లా అప్పుడు బయ్యర్లు లేరు. వున్నవారు డిస్ట్రిబ్యూటర్లు.
ఆ డిస్ట్రిబ్యూటర్లు కూడా ఎంతోకొంత అడ్వాన్సు ఇచ్చి సినిమా విడుదల చేసి... తదుపరి వచ్చే కలెక్షన్సుని షేర్ చేసుకుంటారు అనుకుంటే అదీ జరగలేదు-.
ఎవరికీ ఎంజిఆర్‌ని అడిగే ధైర్యంలేదు. అలాగని నెలల తరబడి ఆదాయం లేకుండా సంసారం సాగించలేరు. కక్కలేక, మింగలేక బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. రెండ్రోజుల్లో సినిమా రిలీజవుతోంది.
ఆ చిత్రంలో పనిచేసిన నటీనటులను, టెక్నీషియన్స్‌నీ పిలిచి ప్రెస్‌మీట్‌పెట్టి గ్రాండ్‌గా పార్టీ ఎరేంజ్ చేశారు.
ఒక్కొక్కరినీ పిలిచి.. వాళ్ల కాంట్రాక్టు ఎవౌంట్ ఎంత? ఎంత అడ్వాన్సుగా ఇచ్చారు? ఈ విషయాలు నోట్ చేసుకుంటున్నారు. నటీనటులూ సాంకేతిక నిపుణులూ అందరిదగ్గరా సమాచారం తీసుకోవడమైతే అయ్యింది చేతిలో కవరుంచలేదు. నిరాశగా భుక్తాయాసంతో ఇళ్లకు బయల్దేరారు.
సినిమా విడుదలయ్యింది.
ఇంకేం ఇస్తారులే.. ఈ పెద్దమనుషుల నైజమే అంత- ఏదో.. ఎంతో కొంత అడ్వాన్సు ఇచ్చారుకదా- దాంతో సరిపెట్టుకుందాం! అనుకున్నారు. వారందాటింది. సినిమా కలెక్షన్లవర్షం కురిపిస్తోంది. పోనీలే భగవంతుడా సినిమా అన్నా బ్రహ్మాండంగా ఆడుతుంది. మూడు మాసాలు పడిన కష్టానికి ప్రతిఫలందక్కింది అని సరిపెట్టుకున్నారు.
ఒకరోజు సడన్‌గా ‘అన్న’గారి దగ్గర్నుంచి పిలుపొచ్చింది అందరూ ఆనందంగా వెళ్ళారు. చిత్రంలో పనిచేసిన వారందరికీ పట్టుబట్టలుపెట్టి శాలువాకప్పి సన్మానం చేశారు. చేతిలో చిన్న కవరుంచారు. ఆ కవరుమీద ఎవరి పేరురాసిందో వారినే ఆర్డరు ప్రకారం పిలిచారు. సన్మానించి కవరు చేతికిచ్చి పంపించారు. కవర్లో వున్నది దారిఖర్చులకి నాలుగొందలు అయిదొందలు వుంటుందనుకున్నాం. ఇంటికి వెళ్ళి కవరు తెరిచిచూస్తే ఇంకేముంది? ఆ చిత్రానికి పనిచేసిన నటీనటుల దగ్గర్నించిగానీ, టెక్నీషియన్స్ దగ్గర్నించి గాని ఇచ్చిన అడ్వాన్సులను మినహాయించుకోలేదు. కాంట్రాక్టు ఎవౌంట్‌కి మూడింతలు అంటే ‘లక్ష’ రూపాయలకు మూడు లక్షలు చెక్కు పంపిణీ చేశారు. అందరికీ అంతే. ఆ రాత్రి తెల్లార్లూ ఎవరికీ నిద్రపట్టలేదు. భళ్లున తెల్లవారగానే బిలబిలమంటూ నటీనటులూ, సాంకేతిక నిపుణులూ వచ్చి యంజిఆర్ కాళ్ళమీదపడ్డారు. యంజిఆర్ ఏ పనిచేసినా అంత గుంభనంగా చేసేవాడు.

-ఇమంది రామారావు 9010133844