తెలంగాణ

ఆందోళన ఉధృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: ఇంటర్ బోర్డు కార్యదర్శిని సస్పెండ్‌చేయాలని బీజేపీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జీ భరత్ గౌడ్ రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు వైఫల్యాలకు నిరసనగా 22వ తేదీ సోమవారం ఇంటర్ బోర్డు వద్ద ధర్నా చేస్తామని ఆయన ప్రకటించారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ జవాబుపత్రాల రివాల్యూయేషన్‌కు చెల్లించాల్సిన రుసుమును రద్దు చేయాలని కోరారు. ఇంటర్ బోర్డు జవాబుదారీతనం లేకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందన్నారు. దీని వల్ల అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. ఇంటర్ బోర్డులో జరిగిన అవకతవకలపై న్యాయ పరమైన దర్యాప్తు చేయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం సరికాదని ఆయన అన్నారు. బోర్డు వద్ద సందేహాలను నివృత్తి చేసుకునేందుకు వచ్చిన విద్యార్థులు, వారి తల్లితండ్రుల పట్ల ఇంటర్ బోర్డు అధికారులు అమానుషంగ వ్యవహరించారన్నారు. ఈ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం నుంచి ఎటువంటి భరోసా లభించలేదన్నారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా విద్యా శాఖ మంత్రి ఎటువంటి ప్రకటన చేయకపోవడం దారుణమన్నారు. జవాబుపత్రాల దిద్దే పనిని ప్రైవేట్ ఏజన్సీకి అప్పగించారని, దీని వల్ల అనేక తప్పిదాలు చోటుచేసుకున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని అనిపిస్తోందన్నారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలాగాటమాడుకోవడం దుర్మార్గమన్నారు. ఇంటర్ బోర్డు ఏకపక్ష వైఖరిపై తాడోపేడో తేల్చుకుంటామన్నారు. ఈ విషయమై విద్యార్థులకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతామని ఆయన చెప్పారు.