తెలంగాణ

మేడారం మహాజాతర తేదీలు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి గాంచి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర తేదీలు ఖరారు అయ్యాయి. ములుగు జిల్లా సమ్మక్క సారాలమ్మ తాడ్వాయి మండలం మేడారంలో జరిగే జాతర తేదీలను ఆదివారం మేడారం పూజారులు ఖరారు చేశారు. 2020 ఫిబ్రవరి 5వ తేది బుధవారం సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ద రాజు గద్దెపైకి వస్తారు. 2020 ఫిబ్రవరి 6 గురువారం సమ్మక్క గద్దెపైకి వచ్చుట, 2020 ఫిబ్రవరి 7 శుక్రవారం భక్తులు మొక్కులు చెల్లించడం ఉంటుందని తెలిపారు. ఫిబ్రవరి 8న దేవతలు వన ప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుందని వారు వెల్లడించారు.