ఆంధ్రప్రదేశ్‌

బీసీలకు చేసిన సాయం ఒక్కటైనా చెప్పగలరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 21: బీసీలకు చేసిన సాయం ఏదైనా ఒక్కటి చెప్పగలరా అంటూ ప్రధాని మోదీని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. చెప్పుకునేందుకు చేసిన అభివృద్ధి లేకపోవడంతో కుల, మత, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆదివారం ప్రధానికి రాసిన బహిరంగ లేఖలో ఆరోపించారు. బాధ్యతాయుత పదవిలో కొనసాగతూ, కులాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాని చూడటం ఎన్నికల నియమావళికి వ్యతిరేకమన్నారు. దేశంలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు ఏమిచేశారో అత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. ప్రధాన మంత్రి కార్యాలయంలో ఎంతమంది బీసీలను నియమించారని, ఎందరు బీసీలను గవర్నర్లుగా నియమించారో చెప్పాలని కోరారు. చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని పంపిన తీర్మానాన్ని ఎందుకు ఆమోదించలేదని, ఆర్థిక నేరస్తులకు కొమ్ముకాస్తున్నందుకు దొంగ అంటూ రాజకీయంగా విమర్శిస్తే, దాన్ని బీసీలందరికీ ఆపాదించడం ప్రధాని పదవి విలువను దిగజార్చడం కాదా అని ప్రశ్నించారు. గత ఏడాది 70కోట్ల మంది బీసీలకు 7750 కోట్ల రూపాయలు కేటాయిస్తే, ఏపీలో రెండున్నర కోట్ల మంది బీసీలకు 16వేల కోట్ల రూపాయలు కేటాయించామని గుర్తుచేశారు. మండల్ కమిషన్ నివేదికను అడ్డుకోవడం నిజంకాదా అని ప్రశ్నించారు. వర్సిటీ నియామకాల్లో 13 పాయింట్ల రోస్టర్ విధానం అమలు ద్వారా బీసీలను ప్రొఫెసర్ ఉద్యోగాలకు దూరం చేయడం దారుణమని విమర్శించారు. మాటల్లోని ప్రేమను చేతల్లో ఎప్పుడైనా చూపించారా అని ఎద్దేవా చేశారు. ఇటీవలి ఎన్నికల్లో బీసీల జనాభా ఎక్కువున్న రాష్ట్రాల్లో బీజేపీ ఘోర పరాజయం చవిచూసిందని, బీజేపీని బీసీలు ఎంత ఛీత్కరించుకున్నారో దీనివల్ల తెలుస్తోందని ఉదహరించారు. ఐదేళ్లలో బీసీలను గాలికొదిలేసి ఎన్నికల సమయంలో బీసీ కార్డును నెత్తికెత్తుకోవడం మీ పాలనా వైఫల్యానికి నిదర్శనం కాదా అంటూ ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చాక దేశాభివృద్ధిని పక్కనపెట్టి డజను మంది కార్పొరేట్ల కొమ్ము కాస్తున్నారని విమర్శించారు.