రాష్ట్రీయం

వ్యవస్థలను దెబ్బతీసిన చంద్రబాబుకు శిక్ష తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: గత ఐదేళ్లల్లో ఏపీ చంద్రబాబు అన్ని వ్యవస్థలను దెబ్బతీశారని అందకు శిక్ష తప్పదని వైఎస్సార్ సీపీ అంబటి రాంబాబు జోస్యం చెప్పారు. ఆదివారం నాడు లోటస్‌పాండ్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబుకు ఓటమి తప్పదని తెలిసి అసహనంతో మాట్లాడుతూ తన ప్రతిష్టను తానే దిగజార్చుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మే 23 తర్వాత చంద్రబాబును మాజీ సీఎంగా పిలవాల్సి ఉంటుందన్నారు. తాను జూన్ 8వ తేదీ వరకు ముఖ్యమంత్రిగా ఉంటానని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
కౌంటింగ్ తర్వాత గెలుపు ఓటములు చూసుకుని ఎవరు ముఖ్యమంత్రి అన్నది ఆయా పార్టీలు నిర్ణయిస్తాయన్న విషయాన్ని చంద్రబాబుకు తెలియకపోవడం దురదృష్టకరమన్నారు. దీన్ని బట్టి చంద్రబాబుకు మతిమరుపు వ్యాది ఉన్నదేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు దుష్టపాలనకు అంతం తప్పదన్నారు. చంద్రబాబు ఎన్ని రాజకీయ విన్యాసాలు చేసిన ఫలితం మాత్రం సున్నానే అన్నారు. ఎన్నికల కమిషన్, రాష్ట్ర సీఎస్‌లలపై అహంకార ధోరణితో చంద్రబాబు వ్యవహరించడం దుర్మార్గం అన్నారు. టీడీపీ గెలుస్తుందని, తానే మళ్ళీ సీఎం అవుతానని చెప్పడం చూస్తే ఓటర్ల చెవుల్లో కాలీఫ్లవర్ పెట్టడమేనన్నారు. చంద్రబాబు తన చినబాబు కోసం చేస్తున్న ప్రయత్నాల్లో టీడీపీ భూస్థాపితం కాబోతోందన్న సంకేతాలు ఉన్నాయన్నారు. చంద్రబాబు పార్టీని, కేడర్‌ను బతికించుకోవడానికి బీరాలు పలుకుతున్నారని, అయితే వాస్తవంగా మే 23 తర్వాత చంద్రబాబు కనుమరుగు కావడం ఖాయమన్నారు. వాస్తవాలను ఎన్ని రోజులు దాస్తారని ఆయన ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ఓటర్ల సైతం చంద్రబాబు ఓడిపోవడం ఖాయమన్న అవగాహనకు వచ్చారన్నారు. చంద్రబాబు ఉపన్యాసాలు చూస్తున్న ఓటర్లు తప్పక మంచి నిర్ణయం తీసుకుంటారన్నారు.