జాతీయ వార్తలు

8 రాష్ట్రాలు.. 59 సీట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: కేంద్ర ఎన్నికల కమిషన్ లోక్‌సభ ఏడు, ఆఖరి విడత పోలింగ్‌కు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 59 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. లోక్‌సభకు ఏడు దశల్లో పోలింగ్‌కు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. తొలిదశ పోలింగ్ ఏప్రిల్ 11న జరిగింది. ఆఖరి దశ పోలింగ్ మే 19న ఉంటుంది. తాజా నోటిఫికేషన్ ప్రకారం నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ ఏప్రిల్ 29. ఏప్రిల్ 30 నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నానిమినేషన్ల ఉపసంహరణ గడువుమే 2. ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఏడు దశల్లోనూ ఎన్నికలున్నాయి. కాగా బీజేపీ నాయకత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అలయన్స్(ఎన్‌డీఏ) అన్ని రాష్ట్రాల్లోనూ వివిధ పార్టీల పోటీని ఎదుర్కొంటోంది. కాంగ్రెస్, వామక్షాలు, ప్రాంతీయ పార్టీలు రకరకాల కూటములుగా ఏర్పడి అధికార బీజేపీని సవాల్ చేస్తున్నాయి. ఓట్లు చీలిపోకుండా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాయి. బీజేపీ కూడా పాత, కొత్త మిత్రులతో కలిసి సీట్ల సర్దుబాటు చేసుకుంది. మే 19న ఆఖరి విడత పోలింగ్ పంజాబ్‌లోని 13, హిమాచల్‌ప్రదేశ్, చండీగఢ్‌లోని చెరొక నియోజకవర్గాల్లో జరుగుతుంది. త్రిపుర(తూర్పు) లోక్‌సభ నియోజకవర్గానికి ఈనెల 18న ఎన్నిక జరగాల్సి ఉండగా ఈసీ వాయిదా వేసింది. మంగళవారం అక్కడ పోలింగ్ జరుగుతోంది.