జాతీయ వార్తలు

వార్తల్లో వాయనాడ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాయనాడ్, ఏప్రిల్ 22: గతంలో ఎన్నో సార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగినా కేరళలోని వాయనాడ్ స్థానానికి ఇంతగా ప్రచారం ఎప్పుడూ దక్కలేదు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథి నుంచే కాకుండా, కేరళలోని ఈ నియోజకవర్గం నుంచి కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేయడమే ఇందుకు కారణం. ఈ నియోజకవర్గం నుంచి రాహుల్ ఎన్నికకు సంబంధించి భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. రాహుల్ విజయం ఖాయమని, కాంగ్రెస్ సారథ్యంలోని యుడీఎఫ్ ధీమా వ్యక్తం చేస్తుంటే, అది తేలికైన విషయమేమీ కాదని సీపీఎం నాయకుడు కృష్ణ ప్రసాద్ అంటున్నారు. ఇందుకు కారణం కాంగ్రెస్-బీజేపీలు అనుసరించిన రైతు వ్యతిరేక విధానాలేనని ఆయన వాదన. గెలుపు-ఓటమిల మాట ఎలా ఉన్నా, ఈసారి మాత్రం వాయనాడ్ నియోజకవర్గానికి జాతీయ స్థాయిలో ఎనలేని ప్రాధాన్యత లభించడం ఈ ప్రాంతం వారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నది.