తెలంగాణ

స్పాట్ కేంద్రంలో పెద్ద తప్పే జరిగింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఇంటర్ ఫలితాలకు సంబంధించి బోర్డులో ఎలాంటి గందరగోళం లేదని, ఎలాంటి పొరపాట్లు జరగలేదని, అయితే స్పాట్ వాల్యూయేషన్‌లో పెద్ద తప్పే జరిగిందని దానిని సరిచేయడంతో పాటు అందుకు బాధ్యులైన అధికారులకు షోకాజ్ మెమోలు ఇస్తున్నామని వారికి ఫెనాల్టీ కూడా విధిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ కుమార్ చెప్పారు. ఇంటర్ బోర్డు వద్ద రోజురోజూకూ నిరసనలు పెరగడంతో ఆయన సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ జీ నవ్య అనే అమ్మాయి విషయంలో జరిగింది చిన్న పొరపాటు కాదని, అది పెద్ద పొరపాటేనని అన్నారు. మీడియాలో కథనాలను చూసిన తర్వాత ఆమె సమాధాన పత్రాలను తెప్పించి చూశామని, మార్కులను ఎంటర్ చేసిన ఎగ్జామినర్ 99కు బదులు 00(సున్నాసున్నా)లను బబ్లింగ్ చేశారని దాంతో ఆ అమ్మాయికి సున్నా మార్కులు వచ్చాయని, ఎగ్జామినర్ చేసిన పోరపాటును స్క్రూటినైజర్ కూడా గమనించకపోవడం పెద్ద తప్పేనని అన్నారు. అయితే ఇంటర్ బోర్డులో ఎలాంటి పొరపాట్లు జరగలేదని, అంతా పారదర్శకంగానే జరుగుతోందని పేర్కొన్నారు. ఏ ఒక్కరి జవాబు పత్రాలూ గల్లంతు కాలేదని, ప్రైవేటు సంస్థలపై ఆధారపడకుండా బోర్డు పరీక్షల నిర్వహణ చేపట్టే ప్రక్రియలో భాగంగానే గ్లోబరీనా టెక్నాలజీ అనే సంస్థ సేవలను తీసుకుందని చెప్పారు. ఇంటర్ బోర్డుపై ఈ మధ్య అసత్య ప్రచారం జరుగుతోందని, పారదర్శకంగా వ్యవహరించి నాణ్యతతో కూడిన మూల్యాంకనం చేసి ఫలితాలను ప్రకటించామని అన్నారు. ఇంటర్ ఫలితాలపై వచ్చిన అపోహలను తొలగించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. అక్కడక్కడా క్షేత్ర స్థాయిలో తప్పులు జరిగాయని, ముగ్గురు విద్యార్థులకు సంబంధించిన మెమోల్లో తప్పులు వస్తే వాటిని సవరించామని అన్నారు.జవాబు పత్రాలను చూపించేందుకు తాము సిద్ధమేనని అన్నారు. పరీక్షకు హాజరుకానివాళ్లు పాసైనట్టు జరుగుతున్న ప్రచారం సరికాదని అన్నారు. అనర్హులైన అధ్యాపకులతో మూల్యాంకనం చేశారనే ఆరోపణ కూడా సరికాదని చెప్పారు. అర్హులైన బోర్డు అధ్యాపకులతోనే మూల్యాంకనం చేయించామని అన్నారు. విద్యార్థులు సెంటర్ మారడం వల్ల ఏఎఫ్, ఏపీ వంటి సాంకేతిక సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు.
ఇంటర్ బోర్డు ప్రక్షాళన: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
రుసుం లేకుండానే రీ వాల్యూయేషన్ : సీపీఐ
ఇంటర్మీడియట్ బోర్డును ప్రక్షాళన చేయాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాల నేతలు, విద్యార్థులు , తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు లీలలను ఎండగడ్తున్నారు. తొలుత ఎలాంటి పొరపాట్లు జరగలేదని చెప్పిన బోర్డు కార్యదర్శి అశోక్, రోజుకో మాట మాట్లాడుతున్నారని, మీడియాలో వచ్చిన కథనాలు చూసి పరిశీలిస్తే కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమేనని సోమవారం నాడు ఒప్పుకున్నారని ఈ మొత్తం వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని వారు కోరుతున్నారు.
సీనియర్ ఐఏఎస్‌తో విచారణ: చాడ వెంకటరెడ్డి
ఇంటర్‌బోర్డు వ్యవహారాలపై సీనియర్ ఐఎఎస్ అధికారులతో విచారణ జరిపించలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కోరారు. ఆందోళన చేస్తున్న తల్లిదండ్రులపై కేసులు పెడతామనడం విడ్డూరమని, రీ వాల్యూయేషన్‌కు, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీకి, ఇంప్రూవ్‌మెంట్‌కూ ఫీజులు కట్టమనడం భావ్యం కాదని అన్నారు. ఇంటర్ బోర్డు ఫలితాల వెల్లడి, విద్యార్థి లోకానికి శాపంగా మారిందని చాడ వెంకటరెడ్డి అన్నారు. బోర్డు తప్పులు ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే అవి అపోహలంటూ ప్రభుత్వం పేర్కొనడం విడ్డూరమని అన్నారు. తప్పుడు ఫలితాల వల్ల ఇంత వరకూ 16 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టు తెలుస్తోందని, ఈ వ్యవహారాలపై సీఎం స్పందించాలని అన్నారు.
బోర్డును ప్రక్షాళన చేయాలని కోరుతూ విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సోమవారం నాడు విద్యాశాఖ కార్యదర్శిని కోరింది. ఎఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, టీవీవీ, ఎఐడీఎస్‌ఓ తదితర రాష్ట్ర సంఘాల నేతలు ఆర్ శివరామకృష్ణ, బీ రాము, ఆర్‌ఎల్ మూర్తి, మద్దిలేటి, గంగాధర్‌ల ఆధ్వర్యంలో తెలంగాణ సచివాలయంలో కార్యదర్శి జనార్థనరెడ్డిని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని, కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాస్తున్న బోర్డును ప్రక్షాళన చేయాలని అన్నారు.
బాధ్యులను శిక్షించాలి: సీపీఎం
ఇంటర్ రిజల్ట్సు అవకతవకలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, బాధ్యులను శిక్షించాలని, విద్యార్థులు, తల్లిదండ్రుల పోరాటానికి సీపీఎం మద్దతు ఇస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. బోర్డు తీరు చూస్తుంటే బోర్డు విశ్వసనీయత అనుమానాంగా ఉందని అన్నారు. ఎలాంటి తప్పులు లేవని చెప్పిన అధికారులు తప్పులు సరిచేశామని చెబుతున్నారని ఇదేమిటని అన్నారు.
కలెక్టర్లకు వినతిపత్రాలు: రేవంత్‌రెడ్డి
అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఎన్‌ఎస్‌యూఐ నేతలకు సూచించారు. విద్యార్ధుల హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని ఆయన చెప్పారు.
బోర్డును ప్రక్షాళన చేయాలి: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
ఇంటర్ బోర్డును తక్షణమే ప్రక్షాళన చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పేర్కొన్నారు. అవసరమైన విద్యార్థులు అందరికీ ఉచితంగానే రీ వాల్యూయేషన్ అవకాశం కల్పించాలని, నిర్ణీత గడువు నిర్ణయించి జరిగిన తప్పులు అన్నింటినీ సవరించాలని, పాత జిల్లా కేంద్రాల్లో రీ వాల్యూయేషన్ దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఇంటర్ బోర్డు వ్యాపార కేంద్రంగా మారిందని తగిన రీతిలో ప్రక్షాళన చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా బోర్డు వద్దకు వాస్తవాలు తెలుసుకోవడానికి వచ్చిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల తీరును టీపీటీఎఫ్ నేతలు కొండల్‌రెడ్డి, ఎం రవీందర్, మైన శ్రీనివాస్‌లు ఖండించారు.

చిత్రాలు.. ఏబీవీపీ నేత అయ్యప్పకు పోలీస్ వ్యానులో చేతికి బేడీలు వేసిన దృశ్యం
*ఇంటర్ ఫలితాలను సరిదిద్దాలన్న రేవంత్‌రెడ్డిని బేగంబజార్ పోలీస్ స్టేషన్‌కు తరలించగా
అక్కడ ధర్నాచేస్తున్న దృశ్యం..
*ఇంటర్ బోర్డు ముందు నాయకులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు