అంతర్జాతీయం

కామెరాన్‌ను వదలని పనామా పన్నుల వివరాలతో మరింత పోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఏప్రిల్ 10: పనామా పత్రాలు యునైటెడ్ కింగ్‌డం ప్రధాని డేవిడ్ కామెరాన్‌ను మరింతగా ఇరకాటంలో పడేశాయి. ఈ వ్యవహారంలో తన నిజాయితీని రుజువు చేసుకునేందుకు తన పన్నుల వివరాలను వెల్లడించిన ఆయన మరిన్ని సమస్యల్ని కొనితెచ్చుకున్నట్టయింది. యుకె ప్రధానిగా తన పదవికే ముప్పు తెచ్చే ఈ వివాదం నుంచి బయట పడేందుకు తన ఆదాయం పన్ను రికార్లును ఆయన అనూహ్య రీతిలో విడుదల ఇందుకు కారణమైంది. ముఖ్యంగా తన తల్లి నుంచి లభించిన 2లక్షల 80వేల పౌండ్ల వ్యవహారంపై దుమారం రేగుతోంది. రెండు విడతలుగా తన తల్లి నుంచి ఈ మొత్తం తనకు లభించిందని కామెరాన్ తెలిపారు. 2009 నుంచి గత ఏడాది వరకూ తాను చెల్లించిన పన్నుల వివరాలను ఆయన వెల్లడించారు. 80వేల పౌండ్ల వారసత్వ పన్ను నుంచి తప్పించుకునేందుకే ఇంత మొత్తాన్ని తన ఖాతాలకు బదలాయించారని తెలిపారు.

కాంగ్రెస్‌కు ఇక
నిద్రే ఉండదు:జైట్లీ
కోల్‌కతా, ఏప్రిల్ 10: పనామా పత్రాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బహుళ ఏజెన్సీ దర్యాప్తు వివరాలు వెలుగు చూస్తే కాంగ్రెస్ పార్టీకి నిద్ర పట్టదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. భారతీయుల విదేశీ అక్రమ పెట్టుబడులపై నిష్పాక్షిక రీతిలో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించిన జైట్లీ ఈ అంశం నుంచి తాను తప్పుకోవాలంటూ కాంగ్రెస్, ఆప్ పార్టీలు చేసిన డిమాండ్‌ను తిరస్కరించారు. పనామా పత్రాలలో లీకైన భారతీయుల పేర్లలో జైట్లీకి సన్నిహితుడైన ఓ వ్యక్తి ఉన్నందున దీని నుంచి ఆయన తప్పుకోవాలని రెండు పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ దర్యాప్తుకు జైట్లీ దూరంగా ఉంటే తప్ప వాస్తవాలు బయటికి వచ్చే అవకాశం లేదని పేర్కొన్నాయి. కాగా, అసలు వారి వాదన ఏమిటో నాకు అర్థం కావడం లేదు. దర్యాప్తు నిష్పాక్షికంగా జరుగుతున్నప్పుడు ఎవరూ ఎవరికీ కొమ్ముకాసే ప్రసక్తే ఉండదని జైట్లీ ఉద్ఘాటించారు.