రాష్ట్రీయం

కేసీఆర్ సమీక్షలపై నోరు మెదపరేం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 25: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఇష్టానుసారం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంటే ఎన్నికల సంఘం ఎందుకు నోరు మెదపదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అదే తాను సమీక్షా సమావేశం పెట్టుకుంటే మాత్రం నానా యాగీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఉండవల్లి ప్రజావేదిక వద్ద ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం వైఖరి వల్ల పాలన అస్తవ్యస్తం అవుతోందన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్నవారు మాత్రమే ఈసీ పరిధిలో ఉంటారని, మిగిలిన వాళ్లంతా ప్రభుత్వం కిందే పని చేయాల్సి ఉంటుందని గుర్తు చేశారు. గడచిన ఐదేళ్లుగా ప్రభుత్వ అధికారులు తనకు ఎంతో సహకరించారని, వారు సహకరించడం వల్లే ఎన్నో రంగాల్లో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఇప్పుడు అధికారులు, ప్రభుత్వం మధ్య చీలిక వచ్చేలా ఈసీ వ్యవహరిస్తోందన్నారు. వ్యక్తిగత అజెండాతో ఈసీ పని చేస్తోందని ఆరోపించారు. కులం, మతం అంటూ విభేదాలు సృష్టిస్తోందన్నారు. ఈసీ కుట్రలను సంయుక్తంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలు ముగియగానే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని, టీడీపీ శ్రేణులు మరింతగా శ్రమించేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు.
వైకాపా, బీజేపీల కుట్రలు ఇంకా ముగియలేదు
ప్రధాని మోదీ దుర్మార్గాలకు, ప్రజల సహనానికి ఈ ఎన్నికలు ఒక పరీక్ష అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఉండవల్లి ప్రజావేదిక నుంచి ఆయన గురువారం టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైకాపా, బీజేపీల కుట్రలు ఇంకా ముగియలేదన్నారు. పోలింగ్‌పై 3 దశలుగా నివేదికలు పంపాలని టీడీపీ నేతలను ఆదేశించారు. మే 1 నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఎన్నికల్లో ధన ప్రవాహానికి మొదటి ముద్దాయి మోదీయేనని ధ్వజమెత్తారు. పద్ధతి ప్రకారం పని చేస్తే, ఎన్నికల్లో ఎన్ని అడ్డంకులైనా ఎదుర్కొనగలమన్నారు. పట్టుదలతో సాధించలేదని లేదని చాటామన్నారు. కష్టాలు తెలుగుదేశం పార్టీకి కొత్త కాదని, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం కాబట్టే, పార్టీ రాటుదేలిందని వ్యాఖ్యానించారు. ప్రతి ఎన్నికల్లో 80 శాతం ఓటింగ్ టీడీపీకే రావాలన్నారు. కులాల వారీగా రాష్ట్రంలో ఓటింగ్ చీలిపోరాదని సూచించారు. అభివృద్ధి ప్రాతిపదికనే ఓటింగ్ జరగాలని, పేదల సంక్షేమానికి కృషి చేసిన పార్టీకే ప్రజల మద్దతు ఉండాలన్నారు. కులాలు, మతాల పేరుతో చీలికలు సమాజానికి చేటు కల్గిస్తాయని, సంక్షేమానికి ఈ చీలికలే అడ్డుగోడలని తెలిపారు. ఈ ఎన్నికల్లో మహిళలు, బీసీలు నూరు శాతం టీడీపీనే ఆదరించారన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలలో అత్యధిక ఆదరణ టీడీపీకేనన్నారు. ఇంకా యువతరాన్ని తమ పార్టీవైపు ఆకట్టుకోవాలని, ప్రజల్లో నిరంతర చైతన్యమే అసలైన రాజకీయమని దిశానిర్దేశం చేశారు. అన్ని వర్గాల్లో అవగాహన పెంపే నాయకత్వ లక్షణమన్నారు. ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటామని, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.
మే 1 నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్టు ఆయన ప్రకటించారు. ఇప్పటిదాకా 17-సీ నివేదికలు 19 వేలు అందాయని, మిగిలిన నివేదికలు కూడా వెంటనే పంపాలని సూచించారు. 17-ఏ, 17-సీ ప్రాధాన్యత అందరూ గుర్తుంచుకోవాలని, ఓట్ల లెక్కింపులో చివరి నిమిషం వరకూ ఎవరూ బయటకు రావద్దని ఆదేశించారు. లెక్కింపు పూర్తయ్యే వరకూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికలు పూర్తవడంతో ప్రత్యర్థుల కుట్రలు ముగియలేదని, ఫలితాలు వెల్లడి అయ్యేదాకా వైకాపా, బీజేపీ కుట్రలను కొనసాగిస్తాయన్నారు. కౌంటింగ్ ఏజెంట్లకు నియోజకవర్గాల వారీగా శిక్షణ ఇవ్వాలని, పోల్ అయిన ఓట్లలో పార్లమెంట్, అసెంబ్లీకి తేడాలు, ఈవీఎంలపై, వీవీప్యాట్‌లపై, లెక్కింపుపై అవగాహన ఉండాలన్నారు. ఇంతమంది సమష్టి కృషితోనే అడ్డంకులన్నీ అధిగమించామన్నారు. వైకాపా, బీజేపీ కుట్రలు, కుతంత్రాలు ఇంకా ముగియలేదన్నారు. ఫలితాలు వచ్చే దాకా ఆ రెండు పార్టీల నేతలు దుర్మార్గాలు కొనసాగిస్తారన్నారు.
బూత్, ఏరియా, నియోజకవర్గాలపై 3 దశలుగా పోలింగ్ తీరుపై నివేదికలను బూత్ కన్వీనర్లు, సేవా మిత్రలు, ఇతర బాధ్యులు పంపాలన్నారు. బాగా పనిచేసిన వారు, పని చేయని వారి వివరాలు చెప్పాలని, ఓటింగ్ పెరిగేందుకు దారి తీసిన పరిస్థితులు, అంతర్గతంగా సహకరించిన వారి వివరాలు, వ్యతిరేకించిన వారి వివరాలు చెప్పాలన్నారు. పార్టీలో నాయకత్వ బేరీజుకు ఈ నివేదికలే ప్రామాణికమని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో కాల్‌సెంటర్, కమాండ్ కంట్రోల్ రూమ్ సేవలు, సర్వేలు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు. యుద్ధరంగంలా సైన్యంలో సీబీఎన్ ఆర్మీ పని చేసిందన్నారు. నిరుద్యోగులైతే పార్టీ పనిని సొంతపనిగా చేశారని కితాబిచ్చారు. పార్టీలో ప్రతివిభాగం చిత్తశుద్ధితో పని చేసిందని, జీవితంలో ఈ ఏన్నికల్లోనూ ఇంత పోరాటం ఎదుర్కొనలేదన్నారు. టీడీపీ శ్రేణుల్లో ఇంత పోరాట పటిమ గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. అక్కడక్కడా కొంతమంది నేతలు డ్రామాలు ఆడినా నడవలేదన్నారు. ఎన్నికల ఫలితాలను, వాస్తవాలతో బేరీజు వేసుకోవాలన్నారు. మీ విశే్లషణా సామర్థ్యానికి అవే గీటురాళ్లన్నారు. ఎవరు శక్తికి మించి పని చేశారు.. శక్తి ఉన్నా ఎవరు సరిగా పని చేయలేదు వంటి వివరాలతో సమగ్ర సమాచారం పంపాలన్నారు.
మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటకలో పర్యటనలు విజయవంతం అయ్యాయన్నారు. త్వరలోనే మిగిలిన రాష్ట్రాల్లో పర్యటిస్తానని తెలిపారు. ఏపీ ఎన్నికల్లో జరిగిన కుట్రలను వివరించానని, ఆయా రాష్ట్రాల్లో పార్టీలను, ప్రజలను చైతన్య పరిచానన్నారు. ఈవీఎంల మొరాయింపుపై అవగాహన కల్పించామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.