జాతీయ వార్తలు

జైషే చీఫ్ మసూద్ అంతర్జాతీయ ఉగ్రవాదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 1: ఐక్యరాజ్యసమితిలో భారత్ నైతిక విజయాన్ని సాధించింది. పాకిస్తాన్ కేంద్రంగా పలు దాడులకు ప్రేరేపిస్తున్న జైషే మహమ్మద్ చీఫ్ అజర్ మసూద్‌ను భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈమేరకు తీర్మానాన్ని బుధవారం ఆమోదించారు. భారత్ చాలా కాలంగా మసూద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా మండలిలో వీటో అధికారం ఉన్న చైనా ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తూ వచ్చింది. నాలుగు పర్యాయాలు మసూద్ అంశం చర్చకు వచ్చినప్పటికీ చైనా వ్యతిరేకించిన కారణంగా అతనిని ఉగ్రవాదిగా ప్రకటించే అవకాశం లేకపోయింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న నిరసనలు, వివిధ దేశాల నుంచి పెరుగుతున్న ఒత్తిడులు చైనాపై ప్రభావం చూపించాయి. మసూద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించకుండా ఇంకా అడ్డుపడుతూ ఉంటే ప్రపంచంలో ఏకాకిగా మిగిలే ప్రమాదం ఉందని గ్రహించిన చైనా తన అభ్యంతరాలను వెనక్కి తీసుకుంది. దీంతో మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్ ప్రతిపాదనకు భద్రతా మండలిలో ఆమోదం లభించింది. అమెరికా, యూకే, ఫ్రాన్స్ తదితర దేశాలు కూడా మసూద్‌పై ఇప్పటికే నిషేధాన్ని విధించాయి. అతనిపై విచారణ జరిపించాలని, జైషే మహమ్మద్ పాల్పడిన దాడులకు అతనిని బాధ్యుడిగా చేయాలని అమెరికా ఇప్పటికే పాకిస్తాన్‌కు స్పష్టం చేసింది. పుల్వామా ఉగ్రవాద దాడి తర్వాత ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో మసూద్ చర్యలను దుయ్యబట్టాయి. అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని నాలుగు పర్యాయాలు భద్రతా మండలిలో వచ్చిన ప్రతిపాదనలకు అన్ని దేశాలు సానుకూలంగా స్పందించినా చైనా మాత్రం తన విశేష అధికారాన్ని ఉపయోగించి దానిని వీటో చేసింది. గత పదేళ్లుగా మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న డిమాండ్ చైనా, పాకిస్తాన్ కారణంగా అమల్లోకి రాలేదు. కానీ, ఈసారి మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంలో భద్రతా మండలి సఫలీకృతమైంది. చైనా తన అభ్యంతరాలను వెనక్కి తీసుకోవడంతో అతనిపై ఉగ్రవాద ముద్ర పడింది.
ఇది మోదీ విజయం
న్యూఢిల్లీ: అజర్ మసూద్‌ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం ప్రధాన నరేంద్ర మోదీ సాధించిన విజయమని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. దీనిని చారిత్రక సంఘటనగా ఆయన అభివర్ణించారు. ‘మోదీ హైతో ముంకిన్ హై’ (మోదీ ఉంటేనే సాధ్యమవుతుంది’ అన్న తమ నినాదం నిజమని మరోసారి రుజువైందని జైట్లీ వ్యాఖ్యానించారు. మోదీ తీసుకున్న నిర్ణయాలు, అమలుపర్చిన వ్యూహాలు ఐక్యరాజ్యసమితిలో భారత్ ప్రతిష్టను నిలబెట్టాయని జైట్లీ వ్యాఖ్యానించారు.