రాష్ట్రీయం

శ్రీశైలం డ్యాం ఫ్లంజ్ పూల్‌పై అధ్యయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం టౌన్, మే 2: శ్రీశైలం డ్యాం ఫ్లంజ్ పూల్ వద్ద సర్వే ప్రారంభమైంది. గురువారం ప్రారంభమైన ఈ సర్వే దాదాపు 10 రోజుల పాటు కొనసాగనుంది. గోవాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫికి చెందిన శాస్తవ్రేత్తలతో పాటు వైజాగ్‌కు చెందిన ఓషనోగ్రఫీ నిపుణుల బృందం అండర్ వాటర్ వీడియోతో సర్వే చేస్తున్నారు. 3 రోజుల క్రితమే సర్వే చేపట్టాల్సి ఉండగా, కొందరు నిపుణుల రాక ఆలస్యం కావడంతో సర్వే ఆలస్యమైంది. వీడియోగ్రఫీకి సంబంధించిన పరికరాలు, బోటు, సేఫ్టీ, పరికరాలన్నింటినీ డ్యాం కేబుల్ ద్వారా బకెట్‌తో ఫ్లంజ్ పూల్ వద్దకు చేర్చి సర్వే ప్రారంభించారు. శ్రీశైలం డ్యాం గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేసినప్పుడు నీరు బకెట్ పోర్షన్ ద్వారా ఎగిసిపడి ముందు భాగంలో బలంగా పడడంతో గొయ్యి ఏర్పడింది. దీనినే ఫ్లంజ్ పూల్ అంటారు. 1985 నుంచి 1994 వరకూ ఇంజినీర్లు చేసిన సర్వేలో దాదాపు 50 అడుగుల మేర గొయ్యి ఏర్పడిందని నివేదించారు. ఆ తర్వాత 1995, 2009లో శ్రీశైలం జలాశయానికి ఊహించని విధంగా భారీ వరద రావడం, ఆ తాకిడికి ఫ్లంజ్ పూల్ మరింత ఎక్కువ లోతులో గొయ్యి ఏర్పడింది. 2009 వరదల తరువాత పరిశీలించిన సీడబ్ల్యుసీ, డ్యాం భద్రతా కమిటీ ఫ్లంజ్ పూల్ గొయ్యి వల్ల డ్యాం భద్రతకు ప్రమాదం వాటిళ్లుతుందా అనే అనుమానం వ్యక్తం చేస్తూ అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆ మేరకు 2012లో గోవాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ నిపుణులు ఫ్లంజ్ పూల్ వద్ద అండర్ వాటర్ వీడియోగ్రఫీ చేపట్టారు. ఫ్లంజ్ పూల్ భాగంలో లోతు ఎంత వరకూ విస్తరించింది. డ్యాం పునాదులకు ఎంత దూరంలో ఉంది. దీని వల్ల ఏదైనా ప్రమాదం ఉందా అనే దానిపై సర్వే చేశారు. తద్వారా 6,7 గేట్లకు దిగువన 200 మీటర్ల దూరంలో లోతైన గొయ్యి ఏర్పడిందని, సంబంధిత నివేదికలను ఇరిగేషన్ శాఖకు అప్పగించారు. అయితే గతంలో ఫ్లంజ్ పూల్ సర్వే అధ్యయనంపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోగా, ప్రస్తుతం మరోమారు సర్వే ప్రారంభించడం చర్చనీయాంశమైంది. ఈ సర్వేను డ్యాం ఈఈ సాంబశివారెడ్డి పర్యవేక్షిస్తున్నారు.