తెలంగాణ

అన్ని ప్రవేశ పరీక్షలకూ 1 నిమిషం నిబంధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రవేశపరీక్షలకూ నిమిషం నిబంధన వర్తిస్తుందని, వేళ దాటితే పరీక్ష హాలులోకి అనుమతించేది లేదని మరో మారు ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. విద్యార్థుల నుండి వస్తున్న వత్తిడి దృష్ట్యా కొన్ని పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యమైనా గతంలో అనుమతించామని, ఈసారి అలాంటి రాయితీలు ఉండవని పేర్కొంది.
పరీక్షలకు ఆలస్యంగా ఎందుకు రావాలి, ముందు రోజే పరీక్ష కేంద్రాలను నిర్ధారించుకోవాలి, మరుసటి రోజు రెండు గంటలు ముందే పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లో సమయం కంటే ముందే అనుమతిస్తామని, ముందే వస్తే హాలులో కూర్చుని కొంత సేపు విరామం పొందవచ్చని, తద్వారా పరీక్షలను ప్రశాంతంగా రాసుకుని మంచి ర్యాంకులు సాధించే వీలుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆఖరి నిమిషంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం వల్ల హడావుడిగా లేనిపోని పొరపాట్లను చేసే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. ప్రతి ఏడాదీ పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా చేరుకున్న విద్యార్థులపై కనికరం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందనే ఆరోపణలకు తెరదించాలని, ఆలస్యంగా రావడం ఎందుకు? కనికరం లేదని విమర్శలు ఎందుకు, ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి కదా అని ఆయన చెప్పారు. గతంలో మాదిరి కాకుండా విద్యార్థులకు పట్టణాల్లో జోన్లు చేసి వారికి సమీపంలోని కేంద్రాల్లోనే పరీక్ష రాసే వెసులు బాటు కల్పిస్తున్నామని అయినా కొంత మంది బాధ్యతను మరచి ఆలస్యంగా కేంద్రాలకు వస్తున్నారని అలాంటి వారిని పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేది లేదని అన్నారు. అందుకే అభ్యర్ధులు అంతా ముందు రోజు పరీక్ష కేంద్రాలను చూసుకోవాలి, మరసటి రోజు పరీక్ష కేంద్రానికి హాజరయ్యేందుకు పట్టే సమయంపై అంచనా ఉంటుందని కొంత మంది తల్లిదండ్రుల నిర్లిప్తత సైతం విద్యార్థులకు శాపంగా మారుతోందని ఆయన పేర్కొన్నారు.
షెడ్యూలు ఇదే
టిఎస్ ఎమ్సెట్ మే 3న ప్రారంభం అవుతుంది, 4,6,7,9 తేదీల్లో జరుగుతుంది.ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు స్లాట్‌లు ఉంటాయి. ఉదయం పరీక్ష 10కి మొదలవుతుంది, సాయంత్రం పరీక్ష మూడు గంటలకు ప్రారంభం అవుతుంది కనుక అభ్యర్ధులు ఉదయం పరీక్షకు 8 గంటలకు, మధ్యాహ్నం పరీక్షకు ఒంటి గంటకే కేంద్రాలకు చేరుకోవాలని మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. ఈసెట్ పరీక్ష మే 11న ఉదయం 10 నుండి ఒంటి గంట వరకూ జరుగుతుంది. లాసెట్ పరీక్ష , పీజీ లాసెట్ మే 20న ఉదయం 11 నుండి 12.30 వరకూ జరుగుతుంది. ఐసెట్ మే 23, 24 తేదీల్లో ఉదయం 10 నుండి 12.30 వరకూ, సాయంత్రం 2.30 నుండి ఐదు గంటల వరకూ జరుగుతాయి. పీజీఈసెట్ మే 28, 29,30,31 తేదీల్లో ఉదయం 10 నుండి 12 వరకూ, మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకూ జరుగుతాయి. ఇక ఎడ్‌సెట్ పరీక్ష మే 31న ఉదయం 11 నుండి ఒంటి గంట వరకూ, మధ్యాహ్నం 3 గంటల నుండి ఐదు గంటల వరకూ జరుగుతుందని, 2 గంటల ముందే కేంద్రాలకు చేరుకోవాలని మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి సూచించారు.