ఆంధ్రప్రదేశ్‌

ఇంకా మట్టిలోనే పోలవరం పవర్ హౌస్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 2: పోలవరం ప్రాజెక్టు పవర్ హౌస్ నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. మట్టి పని నుంచి పవర్ హౌస్ నిర్మాణం బయటపడలేని స్థితి నెలకొంది. ప్రస్తుతం పవర్ హౌస్ నిర్మాణ ప్రాంతంలోని కొండను దొలిచే పని శరవేగంగా జరుగుతోంది. నిర్ధేశించిన లక్ష్యం మేరకు సరిగ్గా ఏడాదికి క్రితం అంటే గత ఏప్రిల్‌లో మట్టిపని పూర్తయ్యి, సివిల్ పనులు చేపట్టాల్సివుంది. ఈ పనులు నవయుగ కంపెనీ అధీనంలోకి వచ్చి దాదాపు ఏడాది కావొస్తోంది. కానీ ఇప్పటికీ మట్టి పనులు జరుగుతూనే వున్నాయి. సివిల్ పనులు ఎపుడు చేపడతారో తెలియని గందరగోళం నెలకొంది.
విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణానికి అవసరమైన భూమిని పదేళ్ల క్రితమే అప్పగించారు. దాదాపు పదేళ్ళ క్రితమే ఇక్కడి అంగుళూరు గ్రామాన్ని ఖాళీ చేయించారు. ప్రస్తుతం కొండ ప్రాంతాన్ని శరవేగంగా దొలిచే పని జరుగుతోంది. మట్టి పని పోలవరం ప్రాజెక్టులో భాగంగానే నవయుగ సంస్థ చేపట్టింది. పవర్ హౌస్ నిర్మాణ పనులు కూడా నవయుగ జాయింట్ వెంచర్ సంస్థకే దక్కాయి. ఏపీ జెన్కో ఆధ్వర్యంలో పవర్ హౌస్ పనులు జరగనున్నాయి. సివిల్ పనులకు టెండర్లు పూర్తిచేసి దాదాపు ఏడాది దాటుతోంది. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ అది నీటిపారుదల ప్రాజెక్టుగానే చట్టంలోవుంది. దీంతో ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తోంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే 960 మెగావాట్ల విద్యుత్‌ను తీసుకోవడానికి వీలుగా ఈ ప్రాజెక్టును రాష్టమ్రే చేపట్టింది. రోజుకు 2.6 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని లక్ష్యంగా ప్రారంభించి ప్రస్తుతం 3.6 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని చేయాల్సిందిగా లక్ష్యాన్ని మార్చుకుని పని జరుగుతోంది. కేంద్రం విద్యుత్ కేంద్రానికి మినహాయించి, మిగిలిన నిధులు మాత్రమే ఇస్తోంది. రాష్టమ్రే సొంత నిధులు సమకూర్చుకుని జెన్కో ఆధ్వర్యంలో ప్లాంట్ నిర్మాణ పనులు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. మొదటి యూనిట్ 2020 కల్లా విద్యుత్ ఉత్పత్తి చేయాలని నిర్ధేశించారు. మట్టి పనులు అయిన వెంటనే సివిల్ పనులు చేపడితే వచ్చే ఏడాదికి మొదటి యూనిట్ పూర్తయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మే నెలాఖరుకల్లా మట్టి పని పూర్తిచేయడానికి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఒక్కో యూనిట్ 80 మెగావాట్ల సామర్ధ్యంతో మొత్తం 12 యూనిట్లు నిర్మిస్తారు. ప్రస్తుతం కొండ దొలిచే మట్టి పనితో సహా మొత్తం ఒక కోటి 49 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని పూర్తి చేయాల్సి వుంది. వాస్తవానికి 2017లోనే ఏపీ జెన్కో నిర్మాణం చేపట్టాల్సివుంది. ఈ ప్లాంట్ ద్వారా రోజుకు 2.40 లక్షల యూనిట్ల ఉత్పత్తి చేసే విధంగా రూపకల్పన చేశారు. ఎనిమిది సంవత్సరాల్లో పెట్టుబడి వెనక్కి వస్తుందని అంచనావేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. పోలవరం పవర్ ప్రాజెక్టు ఉత్పత్తి ద్వారా 960 మెగావాట్లు, రాష్ట్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్ 1800 వెరసి 2760 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సమకూరగలదు. రానున్న పారిశ్రామిక అవసరాలకు ఈ ప్రాజెక్టు చాలా కీలకం కానుంది. ప్రస్తుతం ఏపీ జెన్కో నిధుల సమీకరణలో పడింది. వివిధ కేంద్ర పథకాలు, బాండ్ల ద్వారా సమకూర్చుకునే అవకాశం కన్పిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే 2022 కల్లా రాష్ట్రం విద్యుత్ మిగులు దశకు చేరుకోనుంది. పవర్ హౌస్ పునాదులను ఇప్పటికే సీ డబ్ల్యూసీ ఆమోదించింది. పునాది పనుల పరీక్షలు కూడా సీ డబ్ల్యుసీ ఆమోదం లభించాయి. మొత్తం మీద పోలవరం జల విద్యుత్ ఉత్పత్తిలో 80 మెగావాట్ల సామర్ధ్యం గల 12 టర్బైన్ల ద్వారా 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అందుబాటులోకి వస్తే రాష్ట్రం విద్యుత్‌లో సాధికారత సాధించినట్టే.