AADIVAVRAM - Others

మాధుర్యం తోడైతే కళకు మనుగడ (కళాంజలి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ కళలు భగవంతుని పాదాలనుండి జన్మించి, తిరిగి అక్కడకే చేరుకుంటాయి. భక్తికోసం, భక్తివలన, భక్తినుండి జన్మించి, ప్రచారం పొంది, తిరిగి భగవంతుని పాద పద్మములు చేరటం- ఇది ఒక పవిత్ర వలయం. భక్తి మాత్రమే భారతీయ కళల పథము, గమ్యము!
అన్నమయ్యకు పద్మశ్రీ ఉందా? త్యాగయ్యకు అవార్డులు ఉన్నాయా? జయదేవుడికి సంగీత నాటక అకాడమీ అవార్డు, సాహిత్య నాటక అకాడమీ అవార్డు ఉన్నాయా? ఈ రోజుల్లో మనవాళ్ళు రాసేవి ఇవాళ రాస్తే రేపు గుర్తు ఉండవు. అన్నమయ్య ఎప్పుడో 600 ఏళ్ళ క్రితంవాడు. ఇది 21వ శతాబ్దం. ఈ రోజుల్లో, ఈ దేశ కాల పరిస్థితుల్లో కళాకారులకు గుర్తింపు కావాలి అంటారు- అది సరే! ఎంత నీ‘రసం’గా ఉంది నేటి కళాసృష్టి? నేడు కళ ఒక కార్ఖానాలా తయారయింది. జీవితం ధన్యం కావాలంటే ఒక కళా సృష్టి చాలు.
జయదేవుడి గీతగోవిందంలో 24 అష్టపదులున్నాయి. త్యాగరాజు పంచరత్న కీర్తనలు ఒక ఎత్తు, మిగిలినవన్నీ ఒక ఎత్తు. మన కళా తపస్వి కె.విశ్వనాథ్ శంకరాభరణంతో అతని జీవితం ధన్యమైంది. తరువాత సాగరసంగమం కూడా అదే స్థాయి. మిగిలివన్నీ చెరుకు పిప్పి! కాబట్టి ఎన్నాళ్ళు, ఎంత సృష్టించారు అన్నది ముఖ్యం కాదు. అందులో మాధుర్యం ముఖ్యం. చాలామంది కళను వ్యాపకంగా, వ్యాపారంగా ఎంచుకుంటారు. అందుకు భిన్నంగా కళను వ్యాప్తి చేయడానికి భగవంతుడే ఎంచుకున్న ముద్దుబిడ్డలు ఉన్నారు. అది ఎన్నో జన్మల పుణ్యం. వారికి కళాహృదయ స్పందన, కళ వీరి నాడుల్లో ప్రవహించే రక్తం. కళ వీరి కన్నులో స్రవించే కన్నీరు. ధనం కోసం, కేవలం అవార్డుల కోసం చేసేది వ్యాపారమే కాని, కళారాధన కాదు.
ఒక అంగడిలో కూరలు అమ్మడానికి, కళను అమ్మడానికి తేడా లేదు. కళాకారుడి హృదయ స్పందనలోంచి, క్షీరసాగర మథనంలోంచి వచ్చేది కళ. నిజమే! కూడు గుడ్డ కావాలి! కాని, ఆపై ఉండే దురాశ కళను చంపేస్తుంది. తన కన్నీళ్ళను తాను తాగుతూ ప్రపంచానికి పన్నీటిని అందించేవాడు కళాకారుడు. చాలామంది కళ వేరు కళాకారుడు వేరు అంటారు.
అది నిజం కాదు. కళ ఆత్మ, కళాకారుడు శరీరం. ఒక కళాకారుడు జీవితాన్ని అరిషడ్వర్గాల్లో జీవిస్తూ,. పంచమకారాల్లో తేలుతూ, ‘నా వ్యక్తిగత జీవితం చూడకండి, కేవలం నా వృత్తినే చూడండి’ అంటారు. అయితే కళాకారుడు ఒక సమాజాన్ని ప్రభావితం చేసే ముని. అందుకే కళాకారుడి వ్యక్తిగత జీవనం, వృత్తి వేరుకాదు.
పిల్లి కళ్ళు మూసుకుని తాగుతూ ‘‘నేను ఎవరికి కనపడటంలేదు’’ అనుకుంటుంది. అలాగే కళాకారుడు తెరవెనుక చేసే వ్యవహారాలన్నీ రంగస్థలంమీదకి వచ్చి, తెచ్చి తన కళలో కలిపేసి కలగాపులగం చేస్తాడు. ఎవరికీ తెలియదు అని ఎంత అనుకుంటాడో అది ప్రేక్షకుడికి కొట్టవచ్చినట్లుగా కనబడి, ప్రేక్షకుడికి ప్రకంపనలు పుడతాయి. ఇది ఏ కళకయినా వర్తిస్తుంది. ఉదాహరణకు కొందరు జీవితంలో దుఃఖంలో ఉన్నపుడు రంగస్థలంలో కరుణ రసం చేస్తుంటారు, ఎప్పుడూ ఏడుస్తుంటారు. కొందరు బీభత్సాన్ని ప్రధాన రసంగా సృష్టిస్తారు. అది వారి మానసిక అవస్థను తెలియపరుస్తుంది. అది వారి జీవన శైలిని చూపిస్తుంది. అందుకే నానృషి కురుతే కావ్యం అన్నారు.
ఒక కళాకారుడికి డబ్బు కావాలా? గౌరవాలు, సన్మానాలు కావాలా? లేక కళ కావాలా? ఇది పెద్ద రహస్యం కాదు. ప్రేక్షకుడికి తప్పకుండా తెలుస్తుంది. ఒక పరమ రహస్యం ఏంటంటే, డబ్బు వెనుక పరుగులెడితే డబ్బు వాడి నుండి పారిపోతుంది. అలాగే అవార్డులు, సన్మానాలు, చప్పట్లు కావాలనుకునేవారికి అవి దొరకవు. అది ఒక ఎండమావి. కేవలం కళ కోసం జీవితం అంకితం చేసినవారి వెనుక జనం, డబ్బు, సన్మానాలు పరిగెడతాయి. కళాకారుడు తీయని నీళ్ళు ఊరే దొరువు కావాలి. అంతేకాదు ఈగలు ముసిరే చెరుకు పిప్పి కాకూడదు. వ్రాసే వాళ్ళు బీభత్సంగా రాస్తున్నారు. చేసేవాళ్ళు డబ్బుకోసం కళా వ్యాపారం చేస్తున్నారు. చూసేవాళ్ళు నీ‘రసం’గా ఉంటున్నారు.
కాబట్టి కళారాధన చేసే అదిత్రికాలాబాధితవవుతుంది. చేసేవాడికి, చూసేవాడికి భక్తి, రక్తి, ముక్తి లభిస్తాయి. అప్పుడే కళ దేశ కాల పరిస్థితులను అధిగమిస్తుంది.

-డా. శ్రీలేఖ కొచ్చెర్లకోట, పిహెచ్.డి