తెలంగాణ

బ్రిటిష్‌ను తలపిస్తున్న టీఆర్‌ఎస్ పాలన : షబ్బీర్ అలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, మే 4: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పాలన బ్రిటీష్ పాలనను తలపిస్తుందని మాజీ శాసనమండలి ప్రతిపక్షనేత, మాజీ మంత్రి మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. శనివారం కామారెడ్డి సెగ్మెంట్‌లోని చిన్నమల్లారెడ్డి, జంగంపల్లి, రామేశ్వర్‌పల్లి, తిప్పాపూర్, గ్రామాల్లో ఎంపీటీసీ, జడ్పీటిసి అభ్యర్థుల మద్దతుగా జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన మదన్‌మోహన్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజాస్వామ్య రీతిలో పాలన లేదని, ఇది బ్రిటీష్ కాలం నాటి పాలన ఉందని విమ ర్శించారు. 28మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. బాధి త కుటుంబాలకు న్యాయం చేయకుండా, ప్రతిపక్ష ఎమ్మెల్యేల పైనే ఈ టీఆర్‌ఎస్ సర్కార్ దృష్టి ఉందన్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో ఫెయిల్ అయిన విద్యార్థి ఆత్మహత్య చేసుకుందన్నారు. దీనికి కేసీఆర్, కేటీఆర్‌లు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని 22జడ్పీటీసీ స్థానాల్లో 15స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్నారు.