తెలంగాణ

మన పథకాలను ప్రధాని మోదీ కాపీ కొట్టారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, మే 4: రైతులకు పెట్టుబడి కింద అమలు చేస్తున్న రైతు బంధు పథకాన్ని ప్రధాని మోదీ కాపీ కొట్టారని విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నాడు. అంతేకాకుండా రైతులకు మేలు చేకూర్చే ఈ పథకాన్ని ఇతర రాష్ట్రాలు సైతం ఆద ర్శంగా తీసుకొని అమలు చేస్తున్నాయన్నారు. మొదటి విడత ప్రాదేశిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో శనివారం నియోజకవర్గ పరిధిలోని సూర్యాపేట, పెన్‌పహాడ్, చివ్వెంల మండలాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. సూర్యాపేట మండలం కేసా రం, రూప్లా తండా, పెన్‌పహాడ్ మండలం అనాజిపురం, దోసపహాడ్, నాగుల పహాడ్, అన్నారం, చివ్వెంల మండలం బండమీద చందుపట్ల గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో అమలవుతున్న పథకాలను చూసి మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని ఆందోళనలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందలాంటే ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులనే గెలిపించాలన్నా రు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఎంపీపీ వట్టె జానయ్యయాదవ్, రాష్ట్ర ఉన్నత వి ద్యామండలి సభ్యుడు ఒంటెద్దు నర్సింహారెడ్డి, సూర్యాపేట, పెన్‌పహాడ్, చివ్వెంల మండలాల జడ్పీటీసీ అభ్యర్థులు జీడి భిక్షం, భూక్యా సంజీవ్‌నాయక్‌లున్నారు.