తెలంగాణ

రెండో రోజు ఎమ్సెట్‌కు 4261 మంది గైర్హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: తెలంగాణ ఎమ్సెట్ రెండో రోజు శనివారం నాడు పరీక్షకు 56934 మందికి హాల్‌టిక్కెట్లు జారీ చేయగా వారిలో 52,666 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. తెలంగాణలో ఉదయం స్లాట్‌లో 24344 మందికి 23047 మంది , సాయంత్రం స్లాట్‌లో 24327 మందికి 23041 మంది హాజరయ్యారని కన్వీనర్ డాక్టర్ ఎన్ యాదయ్య చెప్పారు. ఉదయం స్లాట్‌లో ఆంధ్రాలో 4127 మందికి 3292 మంది, సాయంత్రం స్లాట్‌లో 4093 మందికి 3250 మంది హాజరయ్యారు. ఉర్దూ మీడియంలో 43 మంది రిజిస్టర్ చేసుకోగా వారిలో 36 మంది హాజరయ్యారని కన్వీనర్ చెప్పారు. శనివారం నాటి పరీక్ష పేపర్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ కార్యక్రమానికి ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి, ఎమ్సెట్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ ఏ వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్ డాక్టర్ ఎన్ యాదయ్య, కో కన్వీనర్ ప్రొఫెసర్ ఎం మంజూర్ హుస్సేన్‌లు హాజరయ్యారు. తెలంగాణలో 83 పరీక్షకేంద్రాల్లోనూ, ఆంధ్రా లో 8 పరీక్ష కేంద్రాల్లో దీనిని నిర్వహించారు.