తెలంగాణ

నూరు శాతం ఆస్తి పన్ను వసూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, మే 4: నూరు శాతం ఆస్తిపన్ను వసూలులో రాష్ట్రంలోనే సిరిసిల్ల మున్సిపాలిటీ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈమేరకు శనివారం డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డా.టీకే.శ్రీదేవి చేతుల నుండి సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ డా.కేవీ. రమణాచారి ప్రశంసా పత్రం అందుకున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను డిమాండ్ రూ.4.10 కోట్లు ఉండగా, ఈ డిమాండ్‌ను 100 శాతం వసూలు చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలోనే నిలిచింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో స్థానిక మున్సిపల్ కమిషనర్ రమణాచారికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ శ్రీదేవి అభినందిస్తూ ప్రశంసా పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కమీషనర్‌తో పాటు సిరిసిల్ల మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ గణేష్‌రెడ్డి పాల్గొన్నారు.

చిత్రం... డీఎంఏ శ్రీదేవి నుండి ప్రశంసాపత్రం అందుకుంటున్న సిరిసిల్ల కమిషనర్ రమణాచారి