రాష్ట్రీయం

పరిషత్‌లో 77 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్,: తెలంగాణ రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సోమవారం జరిగిన పోలింగ్‌లో 77 శాతం ఓట్లు పోలయ్యాయి. తొలిదశలో రాష్ట్ర వ్యాప్తంగా 195 జడ్పీటీసీ స్థానాలకు, 2,097 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. సాయంత్రం 5 గంటల సమయానికి ఓట్లు వేసేందుకు క్యూలైన్లలో నిలబడ్డ వారందరు ఓట్లు వేసే వరకు పోలింగ్ నిర్వహించారు. నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో మాత్రం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటికీ, సాయంత్రం 4 గంటలకే పూర్తి చేశారు. పోలింగ్ ప్రశాంతంగా పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్ కుమార్ తెలిపారు. సోమవారం రాత్రి ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, ఓటర్లు ఎండలను లెక్కచేయకుండా ఓట్లువేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చారన్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 73 శాతం మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును ఉపయోగించుకోగా, పరిషత్ ఎన్నికల్లో మరో నాలుగు శాతం పెరిగి 77 శాతానికి చేరింది. పరిషత్ తొలిదశలో 59,01,985 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉండగా, 45,32,502 మంది వినియోగించుకున్నారు. పురుషుల కన్నా మహిళలే ఎక్కువగా ఓట్లు వేయడం గమనార్హం. 21.47 లక్షల మంది మహిళలు ఓట్లు వేయగా, 20.94 లక్షల మంది పురుషులు మాత్రమే ఓట్లు వేశారు. వాస్తవానికి పురుషులు, మహిళల ఓట్లు దాదాపు సమానంగానే ఉన్నాయి. మహిళా ఓటర్లు 29.73 లక్షలు ఉండగా, పురుష ఓటర్లు 29.28 లక్షల మంది ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 86.19 శాతం ఓట్లు పోల్ కావడంతో రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలిచింది. ఖమ్మం జిల్లా 85.58 శాతం ఓట్లు పోల్ కావడంతో ద్వితీయ స్థానంలో నిలిచింది. సూర్యాపేట జిల్లాలో 85.46 శాతం ఓట్లు పోల్ కావడంతో తృతీయ స్థానంలో నిలిచింది. వనపర్తి జిల్లాలో అతితక్కువగా 71.18 శాతం ఓట్లు పోలయ్యాయి. తక్కువ ఓట్లు పోలైన జిల్లాల్లో రాజన్న సిర్సిల్లా 71.75 శాతం ఓట్లతో చివరి నుండి రెండోస్థానంలో నిలిచింది.
చిత్రం... యాదాద్రి జిల్లా పంతంగిలో ఓటు వేయడానికి బారులు తీరిన దృశ్యం