జాతీయ వార్తలు

ఎమ్మెల్సీ స్థానాలకు నేడే నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణ శాసన మండలిలో ఖాళీ అయిన మూడు స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్ విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి పట్నం నరేంద్రరెడ్డి, నల్గొండ స్థానిక సంస్థల నియోజవర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, వరంగల్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి కొండ మురళీధర్‌రావు శాసనసభ ఎన్నికలకు ముందు రాజీనామా చేశారు. వీరి పదవీ కాలం 2022 వరకు ఉంది. శాసన మండలిలో ఖాళీ అయిన ఈ మూడు స్థానాలకు ఉప ఎన్నికల కోసం షెడ్యూల్‌ను సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ ఎన్నికలకు మే 7న నోటిఫికేషన్ జారీ చేస్తారు. అభ్యర్థుల నుంచి నామినేషన్ల వేసేందుకు చివరి తేది మే 14. నామినేషన్లను మే 15న పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు మే 17. ఈ మూడు స్థానాలకు మే 31 ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. జూన్ 3న కౌంటింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు. ప్రకటన వెలువడిన తేదీ నుంచే సంబంధిత నియోజకవర్గాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని సీఈసీ స్పష్టం చేసింది.