రాష్ట్రీయం

సీబీఎస్‌ఈ టెన్ త ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 6: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) పదో తరగతి ఫలితాలను బోర్డు సోమవారం నాడు విడుదల చేసింది. 500 మార్కులకు గానూ 499 మార్కులు సాధించి 13 మంది, 498 మార్కులు సాధించి 25 మంది, 497 మార్కులు సాధించి 59 మంది జాతీయ స్థాయిలో టాపర్ల జాబితాలో చేరారు. ఈ జాబితాలో 497 మార్కులు సాధించి హైదరాబాద్ అమ్మాయిలు అంకిత్ సాహ, మద్దాల హరిణిలు సైతం టాపర్లుగా నిలిచారు. దేశవ్యాప్తంగా 18 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 91.1 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫిబ్రవరి 21 నుండి మార్చి 29 వరకూ ఈ పరీక్షలు జరిగాయి. భారత్‌లోనే కాకుండా ఇతర దేశాల్లో 98 పరీక్షా కేంద్రాల నుండి మొత్తం 40,296 మంది హాజరయ్యారు. దేశంలో ఢిల్లీ నుండి అత్యధికంగా సీబీఎస్‌ఈ పరీక్షలకు హాజరయ్యారు. కాగా ఫలితాల్లో మాత్రం కేరళ రాజధాని త్రివేండ్రం విద్యార్ధులు అద్భుత ప్రతిభను కనబరిచారు. ఏకంగా 99.85 శాతం ఉత్తీర్ణతో దేశంలోనే అగ్రగామిగా
నిలిచారు. గత ఏడాదితో పోల్చుకుంటే దేశవ్యాప్త ఫలితాలు 4.40 శాతం ఈసారి అధికంగా నమోదైంది. 2017లో పదో తరగతిలో 93.06 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
97.33 శాతం సాధించిన వంటిట్ శ్రీవత్సవ
సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాల్లో సికింద్రాబాద్ గీతాంజలి దేశశ్రీ పాఠశాలకు చెందిన వండిట్ శ్రీవత్సవ 97.33 శాతం మార్కులు సాధించాడు. గణితంలో నూరు శాతం మార్కులు సాధించాడు. తండ్రి డాక్టర్ వివేక్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లో డిప్యుటీ జనరల్ మేనేజర్‌గానూ, తల్లి సీడీఎఫ్‌డీలో సైంటిస్టుగా పనిచేస్తున్నారు.

చిత్రం... 97.33 శాతం సాధించిన వంటిట్ శ్రీవత్సవ