బిజినెస్

విదేశీ పెట్టుబడిదారులకూ మున్సిపల్ బాండ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 8: విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులకు కూడా మున్సిపల్ బాండ్స్ కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తూ సెబీ సర్క్యులర్‌ను జారీ చేసింది. విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించే క్రమంలో మున్సిపల్ బాండ్స్‌లో వారి మదుపును ఆహ్వానిస్తూ భారత రిజర్వ్ బ్యాంక్ ఇటీవలే ఒక తీర్మానాన్ని ఆమోదించింది. స్టేట్ డెవలప్‌మెంట్ లోన్స్ (ఎస్‌బీఎల్) పరిమితులకు లోబడి విదేశీ పెట్టుబడులు ఉండాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇతరత్రా అంశాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా, ఆర్బీఐ నిర్ణయానికి సెబీ ఆమోదముద్ర వేసింది. విదేశీ పెట్టుబడులకు మున్సిపల్ బాండ్స్‌లో అవకాశం కల్పించింది. ‘మగధ్’కు గ్రీన్‌సిగ్నల్: మగధ్ స్టాక్ ఎక్స్ఛేంజి తన కార్యకలాపాలను ప్రారంభించడానికి సెబీ అనుమతించింది. స్టాక్స్ లావాదేవీలతోపాటు దివాళా, ఆస్తుల అమ్మకాలు, సమ్మేళనాలు వంటి కార్యకలాపాలను కూడా సాగించవచ్చునని పేర్కొంది. బకాయిలు చెల్లించాల్సి ఉన్న కారణంగా మగధ్ లావాదేవీలను సెబీ నిలిపివేసింది. అయితే, ప్రస్తుతం బకాయిలేవీ లేనికారణంగా సెబీ తన నిర్ణయాన్ని మార్చుకుంది.