బిజినెస్

భారత్‌పే కొత్త యాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 8: ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించడానికి వీలుగా భారత్‌పే సంస్థ కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. యూపీఐ క్యూఆర్ కోడ్స్ ప్రాతిపదికగా ఈ యాప్ పనిచేస్తుంది. వ్యాపారవేత్తలు తమతమ ఖాతాదారులకు సంబంధించిన నగదు, అరువు, కొనుగోళ్లు, ఇతరత్రా అంశాల్లో ఈ యాప్‌లో నిక్షిప్తం చేయవచ్చు. అదేవిధంగా చెల్లింపు లింకులను ఖాతాదారులకు పంపవచ్చు. తమ తమ ఖాతాలను ట్రాక్ చేసుకునే సదుపాయం కూడా దీనిద్వారా లభిస్తుంది. ఈ కొత్త యాప్ ద్వారా తమ వ్యాపారం మరింత విస్తృతం అవుతుందని భారత్‌పే బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ధీమా వ్యక్తం చేసింది.