బిజినెస్

భారీ పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 8: భారత స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. అంతర్జాతీయ సూచీలు ప్రతికూల ధోరణిని ప్రదర్శించడంతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజి (బీఎస్‌ఈ)లో సెనె్సక్ వేగంగా 487.50 పాయింట్లు పతనమై 37,789.13 పాయింట్లకు పడిపోయింది. జాతీయ స్టాక్ మార్కెట్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ కూడా నష్టాలను చవిచూసింది. 138.45 పాయింట్లు పతనమై 11,359.45 పాయింట్లుగా నమోదైంది. అటు బీఎస్‌ఈలోను, ఇటు ఎన్‌ఎస్‌ఈలోను బుధవారం ట్రేడింగ్ మొదలైన వెంటనే అమ్మకాలు జరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం, రూపాయి మారకపు విలువ ఆశాజనకంగా లేకపోవడం వంటి అంశాలు కూడా భారత మార్కెట్‌ను ప్రభావితం చేశాయి. మధ్యాహ్నం తర్వాత అటు సెనె్సక్స్, ఇటు నిఫ్టీ కొద్దిగా మెరుగుపడినప్పటికీ చివరిలో మరింత దారుణంగా పతనమయ్యాయి. బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో రిలయన్స్ షేర్లు 3.35 శాతం నష్టాలను ఎదుర్కోవడం గమనార్హం. బజాజ్ ఫిన్ (3.33), టాటా మోటార్స్ (2.80), బజాజ్ ఆటో (2.55), ఎస్‌బీఐ (2.58) షేర్లు కూడా నష్టాలను ఎదుర్కొన్నాయి. కాగా, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ హెచ్‌సీఎల్ టెక్ 0.29 శాతం, టీసీఎస్ 0.11 శాతం లాభాలను నమోదు చేయడం విశేషం. ఏషియన్ పెయింట్స్ షేర్లు అటు లాభాల్లోకానీ, ఇటు నష్టాల్లోకానీ ట్రేడ్ కాకుండా స్థిరంగా కొనసాగాయి. ఇలావుంటే, ఎన్‌ఎస్‌ఈలో జీ-ఎంటర్‌టైన్‌మెంట్ భారీగా నష్టపోయింది. ఈ సంస్థ షేర్లు 10.05 శాతం పడిపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బజాజ్ ఫిన్ (3.55), రిలయన్స్ (3.41), టాటా మోటార్స్ (3.12), బజాజ్ ఫిన్ సర్వ్ (2.87) కూడా నష్టాలను చవిచూసిన కంపెనీల జాబితాలో ఉన్నాయి. పతనమవుతున్న సూచీలను తట్టుకుని నిలబడ్డ హిందాల్కో 1.15 శాతం లాభాలను ఆర్జించింది. యూపీఎల్ 1.14, టైటాన్ 0.95, ఏషియన్ పెయింట్స్ 0.52, సిప్లా 0.37 శాతం చొప్పున నష్టాలను ఎదుర్కొన్నాయి.