తెలంగాణ

కాంగ్రెస్ కార్యకర్తల ఆనందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: తెలంగాణలో మూడు లోక్‌సభ సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించడంపై ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. మల్కాజగిరి లోక్‌సభ నుంచి గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ అనుసరిస్తున్న నియంతృత్వ వైఖరికి చెంపపెట్టు అని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కేసీఆర్ ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడుతామన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మూడు సీట్లు లభించడంపై హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి పార్టీ విజయానికి దోహదపడ్డాయన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి పార్టీ కార్యకర్తలతో కలిసి పనిచేసేందుకు సంస్కృతిని పెంచుతామన్నారు. జనంలోకి వెళుతామని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గ విధానాలపై రాజీలేకుండా పోరాడుతామని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కలుపుకుని పోరాడుతామన్నారు. దళితులు, మైనారిటీలు, అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్‌కు అండగా నిలబడ్డారన్నారు. భువనగిరి నుంచి గెలిచిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులు, రైతులు, శ్రామికవర్గం, పారిశ్రామిక కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ పాలనతో అసంతృప్తి చెంది ఉన్నారన్నారు. ఇంటర్ బోర్డు వైఫల్యం వల్ల అనేక మంది విద్యార్థులుమరణించారని, వారిని ఓదార్చేందుకు ప్రభుత్వం కదలలేదన్నారు. భువనగిరి లోక్‌సభ పరిధిలో అభివృద్ధి పనులను చేపడుతామని, నిధులు తెస్తామని ఆయన చెప్పారు.