జాతీయ వార్తలు

కేరళ ప్రభుత్వానికి యూడీఎఫ్ ‘షాక్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, మే 24: లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం కొనసాగితే.. కేరళలో మాత్రం అక్కడి ప్రజలు భిన్నమైన తీర్పునిచ్చారు. లెఫ్ట్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వానికి కోలుకోలేని దెబ్బ కొట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేతృత్వంలోని యూడీఎఫ్ రాష్ట్రంలో క్లీన్ స్వీప్ సాధించింది. 20 స్థానాల్లో 19 స్థానాల్లో యూడీఎఫ్‌ను గెలిపించి యావత్ భారతదేశాన్ని ఆశ్చర్యానికి గురయ్యేలా చేశారు. ‘చావు తప్పి కన్ను లొట్టపోయిన’ చందంగా కేవలం ఒకే ఒక్క పార్లమెంట్ స్థానంలో మాత్రమే ముఖ్యమంత్రి పనిరయి విజయన్ ప్రభుత్వం విజయం సాధించింది. అలపుజ పార్లమెంట్ స్థానంలో కేవలం పదివేల మెజారిటీతో యూడీఎఫ్ అభ్యర్థి ఏఎం ఆరిఫ్ విజయం సాధించి పార్టీ పరువు నిలబెట్టారు. అది కూడా యూడీఎఫ్‌కు కంచుకోటగా భావించే అలతూర్, పాలక్కడ్, అత్తింగల్, కాసరగడ్ సెగ్మెంట్లలో మెజారిటీని యూడీఎఫ్ కైవసం చేసుకోవడం విశేషం. 2004 సంవత్సరంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ 20 స్థానాల్లో 18 స్థానాలను కైవసం చేసుకోగా.. ఇందుకు పూర్తి భిన్నమైన తీర్పును ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలో చవిచూశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ ఎనిమిది స్థానాల్లో గెలుపొందగా 12 స్థానాల్లో యూడీఎఫ్ కైవసం చేసుకొంది. ఇదిలా ఉండగా.. కేరళలో ఎల్‌డీఎఫ్ పతనం వెనుక ‘శబరిమల’ అంశమే ప్రధాన కారణంగా రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గత సంవత్సరం సెప్టెంబర్ 28నుంచి ముఖ్యమంత్రి విజయన్ అమలులో పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా జరిగిన అల్లర్లు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేశాయని చెబుతున్నారు.

ఆ మూడు తప్పులతోనే ఓడారు

తిరువనంతపురం, మే 24: కేరళ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ప్రధాన కారణం అంతర్గత రోడ్ల నిర్మాణంలో వ్యవహరించిన నిర్లక్ష్య వైఖరే ప్రధాన కారణమని ఆ రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రమేష్ చెన్నితాల శుక్రవారం స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ రాష్ట్రంలో అఖండ విజయానికి ఇదే కారణమని తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన ‘మీట్ ద ప్రెస్’లో స్పష్టం చేశారు. యూడీఎఫ్ లౌకికవాదమే బీజేపీని ఓటమి అంచున నిలబెట్టిందని చెప్పారు. కేరళలోని 20 పార్లమెంట్ స్థానాల్లో 19 చోట్ల ఘన విజయం సాధించింది. గత మూడు సంవత్సరాల్లో ఎల్‌డీఎఫ్ ప్రజా వ్యతిరేక పాలన, ఎన్డీయే ప్రభుత్వ విధానాలు సైతం ఇక్కడ యూడీఎఫ్ విజయానికి దోహదపడ్డాయని రమేష్ అన్నారు. కేరళలో ఎక్కడా అంతర్గత రోడ్ల నిర్మాణాన్ని చేపట్టలేదన్నది రుజువులతో సహా నిరూపిస్తామని స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీ విజయాన్ని పక్కన పెడితే.. మూడు అంశాలు మాత్రం మాకు తిరుగులేని విజయాన్ని తెచ్చిపెట్టాయని రమేష్ పేర్కొన్నారు. మూడు అంశాల్లో మోదీపై వ్యతిరేకత, ఎల్‌డీఎఫ్ మూ డేళ్ల ప్రజా వ్యతిరేక పాలన, రాష్ట్రంలో రాహుల్ ప్రభంజనం ఉన్నాయని చెప్పారు. ఇక్కడి వాయినాడ్‌లో రాహుల్‌గాంధీ ఎనిమిది లక్షల మెజారిటీతో విజయం సాధించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనను ఇక్క డి ప్రజలు పూర్తిగా వ్యతిరేకించారని స్పష్టం చేశారు. ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం సుప్రీం తీర్పును అమలుపర్చడంలో దూకుడుగా వ్యవహరించిందన్నారు. ‘్భక్తుల పక్షానే మేమున్నాం.. రెచ్చగొట్టేలా వ్యవహరించలేదు.. బీజేపీ, సంఘ్ పరివార్‌లో దోపిడీ విధానాలకు పాల్పడ్డాయి’ అని రమేష్ చెన్నితాల వ్యాఖ్యానించారు. సంఘ్ పరివార్ రాజకీయాలను ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సహా భావసారూప్యత గల పార్టీలతో కలిసి సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పనిచేశారని ఈ సందర్భంగా రమేష్ పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ మాత్రం ఎల్‌డీఎఫ్‌పై కేరళలో పోటీ చేయక తప్పలేదని స్పష్టం చేశారు.