జాతీయ వార్తలు

30 రాత్రి 7 గం.లకు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 26: లోక్‌సభ ఎన్నికల్లో అత్యంత భారీ మెజారిటీతోవిజయం సాధించిన ఎన్‌డీఏ అధినాయకుడు నరేంద్ర మోదీ ఈ నెల 30వ తేదీ సాయంత్రం ఏడు గంటలకు రాష్టప్రతి భవన్‌లో రెండోసారి దేశం 15వ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన సమాచారాన్ని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ ద్వారా తెలియజేశారు. రాష్టప్రతి ఆయన చేత పదవి, గోపనీయత ప్రమాణాలు చేయిస్తారు. నరేంద్ర మోదీతోపాటు మిత్రపక్షాలైన శివసేన, అకాలీదళ్, లోక్‌జనశక్తి, అప్నాదళ్ సభ్యులు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కేవలం ఒకే సభ్యుడు గెలిచిన అన్నా డీఎంకేకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారా లేదా అనేది స్పష్టం కావటం లేదు. శివసేనకు చెందిన ఇద్దరు సీనియర్ నాయకులకు మంత్రివర్గంలో స్థానం లభించవచ్చని అంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అకాలీదళ్ రెండు సీట్లు గెలిచింది. ప్రకాశ్‌సింగ్ బాదల్ కుమారుడు సుఖ్బీర్ సింగ్ బాదల్, అతని భార్య హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ గెలిచారు. నరేంద్ర మోదీ వీరిద్దరిలో ఎవరిని మంత్రివర్గంలో చేర్చుకుంటారా లేదా అనేది వేచి చూడవలసిందే. ఎల్‌జేపీ అధినాయకుడు రాంవిలాస్ పాశ్వాన్ ఈసారి కేంద్ర మంత్రివర్గంలో చేరేందుకు విముఖత చూపిస్తున్నారు. ఆయన స్థానంలో కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌ను మంత్రివర్గంలో చేర్చుకోవాలని ఆయన కోరుతున్నారు. ఆ కోరిక మేరకు చిరాగ్ పాశ్వాన్‌ను మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి విజయం సాధించిన అప్నాదళ్ అధినాయకురాలు అనుప్రియా పటేల్‌కు మంత్రివర్గంలో మరోసారి అవకాశం లభిస్తుందని అంటున్నారు. నరేంద్ర మోదీ తన ప్రమాణ స్వీకారోత్సవం తరువాత వారం, పది రోజులకు మంత్రివర్గం విస్తరణ చేపడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలాఉంటే నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎంతమంది విదేశీ ప్రముఖలను ఆహ్వానిస్తున్నారనేది స్పష్టం కావటం లేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్‌లకు ఆహ్వానాలు వెళ్లాయనే మాట వినిపిస్తోంది.