రాష్ట్రీయం

‘పరిషత్’లో కారు జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 4: పరిషత్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనం సృష్టించింది. శాసనసభ ఎన్నికల ఫలితాలే పరిషత్ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కు పునరావృతమయ్యాయి. హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లో జరిగిన పరిషత్ ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో జిల్లా పరిషత్ పీఠాలను కైవసం చేసుకోవడానికి సరిపడా మెజారిటీ స్థానాలను టీఆర్‌ఎస్ గెలుచుకుంది. జిల్లా ప్రాదేశిక నియోజకవర్గం (జడ్‌పీటీసీ), మండల ప్రాదేశిక నియోజకవర్గాలలో (ఎంపీటీసీ) మెజారిటీ స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. రాష్టవ్య్రాప్తంగా 534 జడ్‌పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా టీఆర్‌ఎస్ 445 స్థానాలను దక్కించుకుంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ 75 జడ్‌పీటీసీలతో సరిపెట్టుకుంది. బీజేపీ 8 జడ్‌పీటీసీలు, ఇండిపెండెంట్లు ఐదు గెలుచుకున్నారు. మొత్తం 5817 ఎంపీటీసీలలో టీఆర్‌ఎస్ 3557, కాంగ్రెస్ 1377, బీజేపీ 211, సీపీఐ 35, టీడీపీ 21, ఇండిపెండెంట్లు 527 స్థానాలను గెలుచుకున్నాయి. జడ్‌పీటీసీ, ఎంపీటీసీలలో ఏ జిల్లాలూ కూడా ప్రతిపక్ష కాంగ్రెస్ గట్టిపోటీ ఇవ్వలేక పోయింది. అన్ని జిల్లా పరిషత్‌లనూ దక్కించుకోవడానికి సరిపడా మెజారిటీ జడ్‌పీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్ గెలుచుకుంది. ఈ నెల 8న జరుగనున్న జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల్లో 32 జడ్‌పీ పీఠాలు టీఆర్‌ఎస్ దక్కించుకోవడం నల్లేరు మీద నడకే. కాగా ఏ జిల్లాలోనూ జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకోలేని పరాజయాన్ని కాంగ్రెస్‌కు ఎదురైంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఉహించని ఫలితాలను సాధించిన బీజేపీ పరిషత్ ఎన్నికల్లోనూ ఫర్వాలేను అనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా 8 జడ్‌పీటీసీలు, 211 ఎంపీటీసీలను బీజేపీ గెలుచుకోగా, 35 ఎంపీటీసీలను సీపీఐ గెలుచుకుంది.

చిత్రం... తెలంగాణ భవన్ వద్ద టీఆర్‌ఎస్ కార్యకర్తల సంబురాలు