జాతీయ వార్తలు

మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: మహారాష్ట్ర మంత్రివర్గాన్ని ఆదివారంనాడు విస్తరించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు రాధాకృష్ణ వికీ పాటిల్, బీజేపీ ముంబయి శాఖ అధ్యక్షుడు ఆశిష్ షెలార్‌తోసహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మంత్రివర్గంలో చేరారు. ఈ ఎనిమిది మంది మంత్రుల్లో ఐదుగురు జూనియర్ మంత్రులు. మరో నాలుగు నెలల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికలతోపాటు వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టడం విశేషం. రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించడం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఇది మూడోసారి. కాగా, ఆదివారంనాడు మంత్రివర్గంలో చోటుదక్కించుకున్న ఎనిమిది మందిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీ-శివసేన సంకీర్ణ ప్రభుత్వంలోని పంకజ ముండే, విద్యా ఠాకూర్‌లను మంత్రులుగా తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు, అసెంబ్లీలో ఆ పార్టీ తరఫున ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన వికాస్ పాటిల్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) మాజీ నాయకుడు, ఇటీవల శివసేన పార్టీలో చేరిన జయదత్ క్షీరసాగర్ ఆదివారంనాడు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ ముంబయి శాఖ అధ్యక్షుడు ఆశిష్ షెలార్ సైతం కేబినెట్ మంత్రిగా నియమితులయ్యారు. షెలార్ గతంలో ముంబయ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. 2017 మున్సిపల్ ఎన్నికల్లో షెలార్ నాయకత్వంలో బీజేపీ 33 నుంచి 83 వార్డుల్లో విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. అదేవిధంగా తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గంలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్‌పీఐ-అథవాలే) తరఫున అవినాష్ మహాటేకర్‌ను జూనియర్ మంత్రిగా ఆదివారం విస్తరించిన మంత్రివర్గంలో తీసుకున్నారు. ఆర్‌పీఐ(ఏ) అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు రామ్‌దాస్ అథవాలే కేంద్రంలోని ఎన్డీయేలో మంత్రిగా వ్యవహరిస్తున్నారు. కాగా, వికీ పాటిల్, క్షీరసాగర్, మహాటేకర్ శాసనసభ, శాసనమండలిలో సభ్యులు కాకపోయినా ఏదో ఒక చట్టసభకు ఎన్నికయ్యేవరకు వారు ఆరునెలల పాటు మంత్రులుగా కొనసాగుతారు. బీజేపీకి చెందిన సురేష్ ఖడే, సంజయ్ కుటే, అనిల్ బొండే, అశోక్ యుకీ, శివసేనకు చెందిన తనాజీ సావంత్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ మంత్రిగా పదవి చేపట్టిన సావంత్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. మిగిలినవారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు.