ఆంధ్రప్రదేశ్‌

ఆక్రమణలో ఉన్న వక్ఫ్ ఆస్తుల స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 17: రాష్ట్రంలో ఆక్రమణల్లో ఉన్న అన్ని వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకుంటామని ఉప ముఖ్యమంత్రి (మైనారిటీ సంక్షేమం) అంజాద్ బాషా తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మూడో బ్లాక్‌లో ఉన్న ఆ శాఖ కార్యాలయంలోకి లాంఛనంగా సోమవారం ప్రవేశించారు. ఈసంర్భంగా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, తన శాఖలో అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తానన్నారు. దేవదాయ శాఖ తరహాలో వక్ఫ్‌బోర్డుకు జ్యుడీషియల్ అధికారులు ఇచ్చి బలోపేతం చేస్తామన్నారు. కడప జిల్లాలో చర్చ్‌లు, మసీదుల మరమ్మతులకు 3.36 కోట్ల రూపాయల విడుదలపై తొలిసంతకం చేశారు.

చిత్రం...మాట్లాడుతున్న ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా