హైదరాబాద్

మిమిక్రీ పితామహుడు నేరేళ్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: మిమిక్రీ పితామహుడు పద్మశ్రీ డా.నేరెళ్ల వేణుమాధవ్ అని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. నేరెళ్ల వేణుమాధవ్ యాదిలో ‘స్వరార్చన’ కార్యక్రమం మిమిక్రీ అర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రోశయ్య పాల్గొని ప్రసంగించారు. కళాకారులకు మరణం ఉండదని మరో కళాకారుడి కఠంలో చిరస్థాయిగా నిలచిపోతారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణా చారి మాట్లాడుతూ నెరేళ్ల వేణుమాధవ్.. ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. అనేక మంది శిష్యులను తయారు చేసి ప్రొత్సహించారని చెప్పారు. కార్యక్రమంలో దైవజ్ఞ శర్మ, రాజ్‌కుమార్, నేరెళ్ల రాధాకృష్ణ, సినీయర్ మిమిక్రీ కళాకారులు కొండపల్లి మనోజ్ కుమార్, భవిల రవి, హెచ్ ఆర్ కోలా, లోహిత్ కుమార్, కళారత్న మల్లం రమేష్, చంద్రముఖి చంద్రశేఖర్ పాల్గొన్నారు.
అపూర్వమైన కళ ప్రక్రియ ‘హరికథ’
కాచిగూడ, జూన్ 18: తెలుగువారి అపూర్వమైన కళ ప్రక్రియ హరికథా అని తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మెన్ అయాచితం శ్రీ్ధర్ అన్నారు. ప్రముఖ భాగవతారిణి బీ.నాగలక్ష్మీచే ‘శ్రీనివాస కల్యాణం’ హరికథా గానం శ్రీత్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో మంగళవారం గానసభలోని కళావేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అయాచితం శ్రీ్ధర్ పాల్గొని ప్రసంగించారు. మరుగున పడిపొతున్న కళలను శ్రీత్యాగరాయ గానసభ ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. సకల కళలు హరికథలో ఉన్నాయని పేర్కొన్నారు. గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ఆచార్య టీ.గౌరీశంకర్, గానసభ ఉపాధ్యక్షుడు సీహెచ్‌వీ ప్రసాద్ పాల్గొన్నారు.