హైదరాబాద్

అక్రమ ఫ్లెక్సీల తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వానాకాలం కష్టాల నివారణ చర్యలను అమలు చేయటంలో జీహెచ్‌ఎంసీ నిమగ్నమైంది. త్వరలో నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ఇప్పటి వరకు కురిసిన అకాల వర్షాలతో గుణపాఠం నేర్చుకున్న బల్దియా భారీ వర్షాలు కురవక ముందే కాస్త ముందుగా కష్టాల నివారణ చర్యలను అమలు చేస్తోంది. ఇటీవల నగరంలో కొంతకాలం క్రితం బలమైన ఈదురుగాలులతో అకాల వర్షాలు కురవటంతో పలు చోట్ల హోర్డింగ్‌లు, యూనిపోల్స్, ఫ్లడ్‌లైట్లు వంటివి కూలి పలువురు ప్రాణాలు కోల్పొయిన ఘటనలు, ఇటీవల సూరత్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదం నేపథ్యంలో నగరంలో కోచింగ్ సెంటర్లలో విద్యార్థుల భద్రతపై బల్దియా ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే అక్రమంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలను అధికారులు తొలగిస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలో కోచింగ్ సెంటర్లు అత్యధికంగా ఉన్న అమీర్‌పేట మైత్రివనం పరిసర ప్రాంతాల్లో మంగళవారం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా ఒకే రోజు సుమారు 20వేల వరకు బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించినట్లు బల్దియా అధికారులు వెల్లడించారు. మరికొన్ని చోట్ల బలమైన గాలులు వీచినపుడు అగ్నిప్రమాదాలు కూడా సంభవించే అవకాశామున్నందున ముందస్తుగా ఫ్లెక్సీలను కూడా తొలగిస్తున్నారు. కమిషనర్ దాన కిషోర్ ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ జోనల్, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు, మెడికల్ ఆఫీసర్లు ఇతర సిబ్బందితో కలిపి ఈ డ్రైవ్ నిమిత్తం సుమారు 200 మంది అధికారులు, సిబ్బందితో 30 బృందాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఒక్కో బృందంలో జేసీబీ, హోర్డింగ్‌ల తొలగింపునకు అవసరమైన పరికరాలు, సిబ్బంది ఉన్నారు.
అమీర్‌పేట మైత్రివనంలోని పలు బహుళ అంతస్తు భవనాల్లో ప్రమాదకరంగా మారిన బోర్డులను తొలగించుకోవాలని, అందులో కోచింగ్ కోసం వస్తున్న వందలాది మంది విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అగ్నిప్రమాద నివారణ ప్రమాణాలను సమకూర్చుకోవాలని ఆయా సంస్థలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినా, ఆ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు స్పందించకపోవటంతో అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వీటిని తొలగించారు. అమీర్‌పేటలోని మైత్రివనంతో పాటు ధరమ్‌కరమ్ రోడ్డులో కూడా విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, అనధికార హోర్డింగ్‌లలో మంగళవారం కేవలం 40 శాతం మాత్రమే తొలగించినట్లు, ఈ డ్రైవ్ బుధవారం కొనసాగించనున్నట్లు అధికారులు వివరించారు.