క్రైమ్/లీగల్

ట్రిపుల్ ఐటీ జంక్షన్‌లో కారు బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జూన్ 18: గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్‌లో కారు బీభత్సం సృష్టించింది. లైసన్స్ లేకుండా కారు నడపడంతో పాటు సిగ్నల్ జంప్ చేసి రోడ్డు దాటుతున్న ముగ్గురు పాదచారులను డ్రైవర్ ఢీ కొట్టాడు. ప్రమాదానికి ప్రధాన కారకుడైన వ్యక్తి విద్యార్ధి కావడంతో కాపాడేందుకు పోలీసులు విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడినట్లు గుసగుసలు వినబడుతున్నాయి. కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గచ్చిబౌలి నివాసముంటున్న ఉప్పలూరి అజయ్ (19) హోడా సిటీ కారులో గత మంగళ వారం సాయంత్రం స్నేహితులు అర్జున్, రోహన్‌తో కలసి లింగంపల్లి వెళ్తున్నారు. ట్రిపుల్ ఐటీ జంక్షన్‌కు వచ్చే సరికి సిగ్నల్ పడినప్పటికి ప్రీ లెఫ్ట్ వద్ద వాహనాన్ని ఆపకుండా నిర్లక్ష్యంగా అతివేగంగా కారును నడుపుకుంటు వెళ్లాడు. నడుచుకుంటూ వెళ్తున్న యాదయ్యతో పాటు ఇద్దరినిని ఢీకొట్టుకుంటు వెళ్లిపోయారు. కారు నడిపిన వ్యక్తి స్టూడెంట్ కావడంతో కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించి ప్రమాదం విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడినట్లు తెలిసింది. ప్రమాదాన్ని గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీసులు ఫేస్ బుక్‌లో పెట్టారు. ప్రమాదంపై ఎలక్ట్రానిక్ మీడియాలో కథనాలు ప్రచారం కావడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చేసేదిలేక హడావుడిగా నిందితుడితో పాటు తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కారు బీభత్సం కేసును గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.