ఆంధ్రప్రదేశ్‌

మరో రెండు రోజులు వేడిగాలులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 19: ఏపీలో మరో రెండు రోజులపాటు వేడిగాలులు తప్పేటట్టు లేదు. నైరుతి పవనాలు ఏపీకి తాకేందుకు మరో మూడు రోజులు పట్టవచ్చని విశాఖపట్నం వాతావరణ కేంద్రం బుధవారం రాత్రి పేర్కొంది. వేడిని పూర్తిగా హరించే తేమ రావాల్సి ఉందని, అప్పుడే వాతావరణం చల్లబడుతుందని కేంద్రం తెలియజేసింది. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, నెల్లూరు, జంగమహేశ్వరపురం, గుంటూరు తదితర చోట్ల 43డిగ్రీల వరకు ఉంటాయని కేంద్రం వివరించింది. తేమ శాతం తక్కువగా ఉన్నందున నైరుతి రుతు పవనాలు కేరళను తాకినా అక్కడ కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో వాతావరణం పూర్తిగా చల్లబడాలంటే మరో మూడు రోజులు సమయం పట్టవచ్చని కేంద్రం చెబుతోంది. మేఘాలు ఏర్పడటం, ఉరుములు, మెరుపులతో తేలికపాటి జల్లులు కొన్నిచోట్ల పడే అవకాశాలు ఉన్నాయని, ఇది కూడా నైరుతి రుతుపవనాల ప్రభావమేనని కేంద్రం పేర్కొంది. తప్పితే వాతావరణంలో పెద్దగా చెప్పుకోదగిన మార్పులు ఉండవని కేంద్రం తెలిపింది.